యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రతి సినిమాకు తొలి చిత్రంలా కష్టపడుతున్నారు. కథల ఎంపిక దగ్గర నుంచి మేకోవర్ వరకు శ్రద్ధ తీసుకుంటున్నారు. అందరినీ థ్రిల్ కి గురిచేస్తున్నారు. ఇప్పుడు మరోసారి తన నట విశ్వరూపంతో అలరించడానికి సిద్ధమయ్యారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో తెరకెక్కనున్న చిత్రంలో తారక్ మూడు పాత్రల్లో మెప్పించనున్నారు. ఇందులో ఒక పాత్ర స్లిమ్ గా స్టైలిష్ గా ఉంటే, మరొక పాత్ర కండలు పెంచి రఫ్ గా ఉంటుంది. ఈ రెండింటిలో పూర్తి కాంట్రాస్ట్ ని చూపించడానికి ఎన్టీఆర్ కష్టపడుతున్నారు.
బాబీ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ సినిమాకి బాలీవుడ్ కెమెరా మెన్ సీ కే మురళీధరన్ ని సినిమాటోగ్రాఫర్ గా తీసుకోక, హాలీవుడ్ లెగసీ ఎఫెక్ట్స్ టెక్నీషియన్ వాన్సీ హార్ట్ వెల్ ని నియమించారు. పలు హాలీవుడ్ హిట్ చిత్రాలకు పనిచేసిన వాన్సీ హార్ట్ వెల్ కోసం ఎన్టీఆర్ విదేశాలకు వెళ్లి, కలిసి కథ చెప్పి ఒప్పించినట్లు తెలిసింది. ఇంతలా ఎన్టీఆర్ కష్టపడడానికి కారణం అభిమానులే అని తెలిసింది. వారు గర్వపడే విధానంగా సినిమాలను చేసేందుకు ఎంత రిస్క్ అయినా తీసుకోవడానికి తారక్ సిద్ధమని అయన సన్నిహితులు వెల్లడించారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.