‘ది రాజాసాబ్’ నిర్మాత చిక్కుల్లో పడ్డారు అనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. విషయంలోకి వెళితే… ఢిల్లీకి చెందిన ‘IVY ఎంటర్‌టైన్‌మెంట్స్’ సంస్థ ‘ది రాజా సాబ్’ నిర్మాతలపై కేసు వేసింది. అగ్రిమెంట్ బ్రేక్ చేయడమే దీనికి ప్రధాన కారణం అని తెలుస్తుంది. ‘ది రాజాసాబ్’ సినిమా కోసం ఆ సంస్థ వద్ద రూ.218 కోట్లు అప్పుగా తీసుకుందట ‘పీపుల్ మీడియా’ సంస్థ. ‘వరల్డ్ వైడ్‌గా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులు ‘IVY ఎంటర్‌టైన్‌మెంట్స్’ కి ఇవ్వాలనేది అగ్రిమెంట్లో ఉందట.
అయితే సినిమా అనుకున్న టైంకి రిలీజ్ కాలేదు. షూటింగ్ పై కూడా ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో అగ్రిమెంట్ ను బ్రేక్ చేశారంటూ ‘IVY ఎంటర్‌టైన్‌మెంట్స్’ కోర్టుకెక్కింది. తమకు న్యాయం చేయాలని న్యాయస్థానాన్ని విన్నవించుకుంది ‘IVY ఎంటర్‌టైన్‌మెంట్స్’ సంస్థ.
అయితే ‘ది రాజాసాబ్’ కి రూ.218 కోట్లు మాత్రమే కాదు.. ఇంకా ఎక్కువ పెట్టాల్సి వచ్చింది.వీ.ఎఫ్.ఎక్స్ విషయంలో పీపుల్ మీడియా సంస్థ భారీగా ఖర్చు పెట్టింది. దాని వల్లే ఆలస్యం అనేది పీపుల్ మీడియా వారి రెస్పాన్స్. ఈ ఇష్యూని సాధ్యమైనంత త్వరగా సార్ట్ అవుట్ చేసుకోవాలని పీపుల్ మీడియా సంస్థ నిర్ణయించుకుంది. సినిమా విడుదలకు ముందుగానే కోర్టు వారి చెప్పినట్టు ‘IVY..’ సంస్థకు మొత్తం అమౌంట్ చెల్లిస్తామని, వడ్డీతో కలిపి ఇచ్చేస్తామని.. కానీ థియేట్రికల్ హక్కులు వంటివి కోరకుండా చూడాలని ‘పీపుల్ మీడియా’ సంస్థ కోర్టును విన్నవించుకుంది. దీంతో IVY కి కౌంటర్ ప్రతిపాదన ఇవ్వాలని, సమస్యను వెంటనే పరిష్కరించుకునేందుకు సిద్ధమవ్వాలి అని IVY తరపు లాయర్లను ఆదేశించింది ఢిల్లీ హైకోర్టు. సో ఇష్యూ ఆల్మోస్ట్ క్లోజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.