సమంత అందానికి కారణం అదేనంట

సినిమాలోకి అడుగుపెట్టినప్పుడు.. ఇప్పుడు చూసుకుంటే సమంతలో చాలా మార్పు వచ్చింది. అనుభవం వచ్చింది కదా అభినయంలో మెరుగు పడడం సహజమే అని లైట్ తీసుకోకండి. మేము చెప్పేది అందంలో. సినిమాకి సినిమాకి మరింత అందంగా కనిపిస్తోంది. వయసుపెరిగే కొద్దీ ఆమె మరింత ఆకర్షణగా తయారవుతోంది. ఆ అందానికి కారణం ఏమిటని చాలా సార్లు విలేకరులు అడిగితే మిగతా స్టార్స్ మాదిరిగానే.. నవ్వుతూ థాంక్స్ చెప్పేది. కారణం మాత్రం వెల్లడించలేదు. తాజాగా ఎవరూ అడగకపోయినా తన గ్లామర్ సీక్రెట్ బయటపెట్టింది. “యాపిల్ సిడర్ వెనిగర్’ తన అందం వెనుకున్న రహస్యమని సమంత సోషల్ మీడియా ద్వారా తెలిపింది.

“ప్రతి రోజూ ఉదయం పరగడుపున యాపిల్ సిడర్ వెనిగర్ తీసుకోండి” అని తన అభిమానులకు సూచించింది. గూగుల్ లో వెతికితే మరెన్నో రెసిపీలు కనపడతాయని వివరించింది. ఈ సీక్రెట్ బయటపెట్టడమే వెనుక వ్యాపార ఆలోచన ఉన్నప్పటికీ.. అమ్మాయిలకి ఇది మంచి చిట్కా కానుంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో సమంత చేస్తున్న రంగస్థలం సినిమా మార్చి 30వ తేదీన రిలీజ్ కానుంది. ద్విభాషా చిత్రం మహానటిలో అభినయ సత్యభామ జమున పాత్ర పోషించింది. ఈ సినిమా మార్చి 29న థియేటర్లోకి రానుంది. అలాగే విశాల్ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న ఇరుంబు తిరాయ్ లో సమంత డాక్టర్ రతీదేవిగా కనిపించనుంది. ఈ చిత్రం జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus