మనసులోని భావాలకు, బయటకు చెప్పే విషయాలకు ఎంతో కొంత తేడా ఉన్నట్లే, సినీ రంగంలో ఉన్న వ్యక్తుల మధ్య స్నేహం ఉందా?, వైరం ఉందా? అనేది చెప్పడం కష్టం. ఈ ఫీల్డ్ లో హీరోలు, హీరోయిన్ల మధ్యే కాకుండా గాయనీమణుల మధ్య కూడా గట్టి పోటీ ఉంటుంది. ఈ పోటీ నుంచే గొడవలు మొదలవుతాయి. అవి కొంతమంది బయటపెడుతారు, మరికొంతమంది మనసులో పెట్టుకుంటారు. సింగర్స్ సునీత, ఉష ల మధ్య ఇప్పటికీ వార్ నడుస్తోందని ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు.
ఈ గొడవకు ఉషకి వచ్చే ఛాన్స్ మొత్తం సునీత లాగేసుకుందని పైకి తెలిసిన కారణం అయితే, వారి వ్యక్తిగత జీవితాలకు సంభందించిన పెద్ద గొడవే ఉందని టాక్. అయితే ఇప్పటికీ ఆ రహస్యాన్ని ఎవరూ ఛేదించలేక పోయారు. ఈ మధ్య ఇదే విషయాన్నీ ఉషని అడగగా.. ఆమె స్పందిస్తూ “సునీత గారికి నాకు ఏవో గొడవలని వార్తలు వచ్చాయి. వాటిని నేను చదివాను. అయితే అవన్నీ కల్పితాలే. నా కంటే సినీయర్ అయిన సునీతా గారిపై నాకు ఎప్పటికీ గౌరవం ఉంటుంది. మేము ఇద్దరు కలసి చాలా స్టేజ్ షోలు చేశాము. ఇప్పటికీ చేస్తూనే వున్నాం. సునీతా గారితో నాకు ఎటువంటి గొడవలు లేవు” అని స్పష్టం చేసింది. బయట సునీత, ఉష మంచి ఫ్రెండ్స్ గా ఉంటారని చూసిన వారూ చెబుతున్నా?వీరిపై రూమర్స్ రావడం ఆగడం లేదు.
https://www.youtube.com/watch?v=kakCdupR3fU