మైత్రీతో ప‌వ‌న్ సినిమా.. ఇంట్ర‌స్టింగ్ డిస్క‌ష‌న్..!

ప‌వ‌ర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వ‌కీల్‌సాబ్ షూటింగ్‌లో పాల్గొంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో త‌న పాత్ర‌కు సంబంధించి డ‌బ్బింగ్ కూడా స్టార్ట్ చేసిన ప‌వ‌న్, ఒక లాంగ్ షెడ్యూల్‌తో ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ పార్ట్ మొత్తం కంప్లీట్ చేయ‌నున్నార‌ని సమాచారం. ఈ మూవీ వ‌ర్క్ కంప్లీట్ కాగానే, గ్యాప్ ఇవ్వ‌కుండా మ‌ళ‌యాళ రీమేక్ అయ‌ప్ప‌న్ కోషియమ్ చిత్ర షూటింగ్ పాల్గొనేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా అయ్యప్పన్ కోషియమ్ సినిమా నిర్మాత నాగవంశీ అండ్ ద‌ర్శ‌కుడు సాగ‌ర్‌తో ఫైనల్ డిస్కషన్లు అయ్యాయ‌ని తెలుస్తోంది. ఈ సంధ‌ర్భంగా మూల‌క‌థ‌లో కొన్ని మార్పులు, షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్నార‌ని స‌మ‌చారం.

ఈ చిత్రంలో రానాతో పాటు స‌త్య‌రాజ్, ఐశ్వ‌ర్య రాజేష్ కీల‌క పాత్ర‌లు పోషించ‌నున్నార‌ని టాక్. మ‌రో కీ రోల్ కోసం ఓ కీల‌క న‌టి నటిస్తార‌ని తెలుస్తోంది. ఒకే షెడ్యూల్‌లో మొత్తం సినిమాని కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేక‌ర్స్. ఇక మ‌రో ముఖ్య‌మైన విష‌యం ఏంటంటే వ‌రుస‌బెట్టి సినిమాలు చేస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను తాజాగా మైత్రి మూవీ మేక‌ర్స్ క‌లిసార‌ని తెలుస్తోంది. గ‌తంలోనే మైత్రి బ్యాన‌ర్‌లో ప‌వన్ మూవీ చేయాల్సి ఉంది. అయితే జ‌న‌సేనాధి పొలిటిక‌ల్‌గా బిజీగా కావ‌డంతో మైత్రీ మైవీస్‌తో సినిమా పెండింగ్‌లో ప‌డింది. మైత్రి- ప‌వ‌న్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కే మూవీని హ‌రీష్ శంక‌ర్ డైరెక్ట్ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం హ‌రీష్ ప‌వ‌న్ కోసం ఓ ప‌వ‌ర్ ఫుల్ స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నారు.

అయితే ప్ర‌స్తుతం వకీల్ సాబ్ షూటింగ్‌లో పాల్గొంటున్న ప‌వ‌న్‌ను మైత్రీ నిర్మాత‌లు న‌వీన్ ఎర్నేని, ర‌వి శంక‌ర్ య‌ల‌మంచిలి క‌లిసి వ‌చ్చారు. మ‌రోవైపు వ‌కీల్ సాబ్, అయ్య‌ప్ప‌న్ కోషియ‌మ్ చిత్రాల త‌ర్వాత ఎఎమ్ ర‌త్నం సినిమా, డైరెక్ట‌ర్ క్రిష్‌తో మ‌రో సినిమా వ‌రుస‌లో ఉన్నాయి. ఆ చిత్రాలు కంప్లీట్ అయితే త‌ర్వాతే మైత్రీ వంతు వ‌స్తుంది. మ‌రి మైత్రీ టీమ్ ప‌వ‌న్‌ను క‌లిసిన నేప‌ధ్యంలో ఇప్పుడు ఆ కాంబినేష‌న్ పై ఎలాంటి అప్‌డేట్ వ‌స్తుంద‌నేది ఇప్పుడు ఆశ‌క్తిగా మారింది. ఏది ఏమైనా ప‌వ‌న్ ఇలా వ‌రుస‌బెట్టి సినిమాలు చేయ‌డం, ఆయ‌న అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus