దీనికి నాగబాబు వీడియో చేయడం మరిచిపోయారేంటి?

బుల్లితెర ‘జబర్దస్త్’ షో ని సక్సెస్ చేయడంలో మెగా బ్రదర్ నాగ పాత్ర చాలా ఉందని చెప్పడంలో సందేహం లేదు. ఈ షో లో ట్యాలెంట్ ఉన్న వారికందరికీ సినిమాల్లో ఛాన్స్ లు కూడా ఇప్పించారనేది ఓపెన్ సీక్రెట్ గా చాలా మంది చెబుతుంటారు. అలాంటిది సడెన్ గా నాగబాబు ఈ షో నుండీ తప్పుకోవడం పట్ల అనేక అనుమానాలు నెలకొన్నాయి. షో నిర్వాహకులతో గొడవలు రావడం వలనే ఇలా షో నుండీ తప్పుకున్నారని ఏవేవో వార్తలు వచ్చాయి. వీటన్నిటికి తన యూట్యూబ్ ద్వారా క్లారిటీ ఇస్తూ వీడియోలు రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటే.. అసలు మ్యాటర్ మరొకటి ఉందనేది తాజా వార్త. ఎలాగూ ఎక్కువ ప్యాకేజి అందుతుందనే వెళ్ళారు అందులో ఎలాంటి సందేహం. అయితే ఎంత వరకూ అందుతుంది అనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

‘జబర్దస్త్’ షో నుండీ తప్పుకున్న నాగబాబు ‘జీ’ వారితో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారనేది తాజా సమాచారం. వారు కూడా ‘జబర్దస్త్’ తరహా కామెడీ షోని ఈ మధ్యనే మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగబాబు కి ప్రతి నెలా 30 లక్షలు వరకూ అందుతోందట. అంతేకాదు… దీంతో పాటు కారవ్యాన్ ఫెసిలిటీ .. సెలబ్రిటీ ట్రీట్ ను కూడా వారు నాగబాబుకి అందిస్తున్నారట. ‘జబర్దస్త్’ కు మల్లెమాల వారి నుండీ 20 లక్షల వరకూ అందుకుంటూ వచ్చిన నాగబాబు.. ఇప్పుడు మరో 10 లక్షలు ఎక్కువ రావడం.. అందులోనూ సెలబ్రిటీ ట్రీట్ కూడా ఉండడంతో.. బయటకి వచ్చేసారని తెలుస్తుంది. తప్పులేదు బెటర్ ఆఫర్ వస్తే ఎవరైనా ఇదే చేస్తారు. కాకపోతే కొంతమంది ‘ఈ మ్యాటర్ పై నాగబాబు వీడియో చేయలేదేంటి’ అంటూ సెటైర్లు వేస్తున్నారు.

వెంకీ మామ సినిమా రివ్యూ & రేటింగ్!
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus