చరణ్ డెబ్యూ ఛాన్స్.. రాజమౌళి ఎందుకు రిజెక్ట్ చేసాడంటే?

స్టార్ హీరోని లాంచ్ చెయ్యడం అంటే మాటలు కాదు. తేడా వస్తే ఆ డైరెక్టర్ పై ఆ స్టార్ హీరో అభిమానులు పగ పెట్టేసుకుంటారు. కొత్త డైరెక్టర్ అయితే సరిగ్గా హ్యాండిల్ చేస్తాడు అన్న గ్యారెంటీ ఉండదు. అందుకే అనుభవం ఉన్న దర్శకుడు.. అందులోనూ ఫామ్లో ఉన్న దర్శకుడితోనే స్టార్ హీరోలు తమ వారసులను లాంచ్ చెయ్యాలని భావిస్తుంటారు. సరిగ్గా ఇలాగే.. మన చిరంజీవిగారు చరణ్ ను .. రాజమౌళి డైరెక్షన్లో లాంచ్ చేయించాలి అనుకున్నారట.

కానీ రాజమౌళి ఇందుకు అంగీకరించలేదు. ‘ఎందుకు?’ అని చిరంజీవి గారు అడిగినప్పుడు ఏదో కారణం చెప్పి తప్పించుకున్నాడట. దాంతో పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘చిరుత’ తో చరణ్ ను లాంచ్ చేయించారు మెగాస్టార్. ఆ చిత్రాన్ని పూరి చాలా శ్రద్ధతో తెరకెక్కించాడు. చరణ్ లోని హైలెట్స్ అయిన డ్యాన్స్ లు, ఫైట్ లు అద్భుతంగా వచ్చేలా పూరి ప్రెజెంట్ చేసాడు. తరువాత చరణ్ రెండో చిత్రాన్ని రాజమౌళి తెరకెక్కించి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. అసలు ఎందుకు చరణ్ ను లాంచ్ చేసే ఛాన్స్ ను యాక్సెప్ట్ చెయ్యలేదు అని రాజమౌళిని అడిగితే..

“చరణ్ ఎలా ఉంటాడు.. ఎలా నటిస్తాడు..! అతని ప్లస్సులు ఏంటి? మైనస్ లు ఏంటి? డ్యాన్స్, ఫైట్స్ ఎలా చేస్తాడు? ఎమోషన్స్ ఎలా పండిస్తాడు? ఇవేవీ నాకు తెలేదు. అది తెలీకుండా చరణ్ కు ఏ కథ సూట్ అవుతుందో అంచనా వెయ్యడం కష్టం.అందుకే చెయ్యలేకపోయాను” అంటూ చెప్పుకొచ్చాడు రాజమౌళి. అయితే ‘చిరుత’ తో చరణ్ తన స్కిల్స్ తో రాజమౌళిని మెప్పించి ‘మగథీర’ చేయించుకున్నాడు. ఇప్పుడు ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం కూడా చేస్తున్నాడు. చరణ్ ను లాంచ్ చెయ్యమని రాజమౌళిని.. చిరు కోరి 14 ఏళ్ళు అయ్యిందట. అందుకే అప్పటి ఆ సందర్భాన్ని మరోసారి రాజమౌళి గుర్తుచేసుకున్నాడు.

Most Recommended Video

కవల పిల్లలు పిల్లలు కన్న సెలెబ్రిటీలు వీరే..!
బాగా ఫేమస్ అయిన ఈ స్టార్స్ బంధువులు కూడా స్టార్సే
బాలయ్య సాధించిన అరుదైన రికార్డ్స్ ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus