తమ్ముడి కోసమే కాదు ప్రొడక్షన్ హౌజ్ పనుల కోసం కూడా!

అమెరికాలో కిడ్నీ ఆపరేషన్ అనంతరం కొన్నాళ్ళపాటు రెస్ట్ తీసుకొని ఇండియాకి వచ్చిన రాణా.. గత కొన్ని రోజులుగా ముంబైలో ఉండిపోయాడు. నిజానికి అమెరికా నుండి రాగానే వేణు ఉడుగుల దర్శకత్వంలో మొదలెట్టిన “విరాటపర్వం” చిత్రం షూటింగ్ లో పాల్గొంటాడు అనుకొన్నారు అందరూ. కానీ.. రాణా మాత్రం ముంబైలో మకాం వేశాడు. తొలుత తన లుక్స్ మీడియాలో హైలైట్ అవ్వకుండా ఉండడం కోసం రాణా అలా చేశాడనుకొన్నారు జనాలు.

అయితే.. రాణా ముంబై స్టేకి చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో మొదటిది తమ్ముడు అభిరామ్. గత కొన్నాళ్లుగా అభిరామ్ ను కథానాయకుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని ప్రయత్నిస్తున్నాడు రాణా. అందుకే.. ముంబైలోని థియేటర్స్ లో కోచింగ్ ఇప్పిస్తున్నాడు. అలాగే.. “ఓ బేబీ” హిందీ రీమేక్ కు సంబంధించిన పనులు కూడా చూసుకొనేందుకు రాణా ముంబైలో ఉండాల్సి వచ్చింది. ఈ పనులన్నీ పూర్తవ్వగానే హైద్రాబాద్ వస్తాడు రాణా బాబు. ఈలోపు కిడ్నీ ఆపరేషన్ కోసం కోల్పోయిన వెయిట్ ను కూడా గెయిన్ అయ్యే పనిలో పడ్డాడు.

ఎవ్వ‌రికీ చెప్పొద్దు సినిమా రివ్యూ & రేటింగ్!
సైరా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus