‘ఆచార్య’కు ఎర్లీ రిలీజ్‌ కారణం ఇదేనా..

  • May 5, 2022 / 02:59 PM IST

‘ఆచార్య’ సినిమా ఫలితం ఏమైందో అందరికీ తెలుసు. అంత దారుణమైన పరాజయం ఎందుకొచ్చింది అంటూ ఓవైపు టీమ్‌ లెక్కేసుకుంటుంటే… సినిమా వసూళ్లు ఏం బాలేవు అంటూ మరికొంతమంది లెక్కలేసుకుంటున్నారు. ఆ లెక్కన భారీ లాస్‌ అయితే పక్కా అని తేల్చారు. అయితే గుడ్డిలో మెల్లలా ‘ఆచార్య’ సినిమాకు ఓ చిన్నపాటి లాభం అయితే కనిపించింది అంటున్నారు. ఆ కారణంగానే ‘ఆచార్య’ ఓటీటీ రిలీజ్‌ను కాస్త ముందుకు జరిపారు అనేది టాక్‌.

ఓటీటీలకు సినిమాలు అమ్ముకునేటప్పుడు కొన్ని లెక్కలు రాసుకుంటారట. సినిమా విడుదలైన ఎన్ని రోజులకు థియేటర్లలోకి వస్తుంది అనే విషయం బట్టే డబ్బులు ఇస్తారట. అంటే సినిమా విడుదలైన 10 రోజులకొస్తే ఓ రేటు, 20 రోజులకు వస్తే అంతకంటే తక్కువ రేటు వస్తుందట. అలా కాస్త ఆలస్యంగా ఓటీటీకి సినిమా తెద్దామనుకున్న ‘ఆచార్య’ టీమ్‌.. ఇప్పుడు ఎర్లీగా వచ్చేస్తుంది. దీంతో సినిమాకు ₹18 కోట్ల నుండి ₹20 కోట్ల వరకు లాభం కలిగింది అనేది లేటెస్ట్‌ టాక్‌.

‘ఆచార్య’ సినిమాను ఈ నెల 20న అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమ్‌ చేస్తారు అని సమాచారం. దీనిపై అధికారిక సమాచారం లేదు కానీ.. మ్యాక్స్‌ అదే డేట్‌ పక్కా అంటున్నారు. అయితే ఆ రోజు ‘ఆర్‌ఆర్‌ఆర్’ కూడా వస్తుంది అంటున్నారు కాబట్టి ‘ఆచార్య’ డేట్‌లో మార్పు ఉండొచ్చు అనేది వేరే టాక్‌. అయితే అది వెనక్కి వెళ్లకుండా ముందుకే వస్తుందని టాక్‌.

ఈ లాభం సంగతి పక్కన పెట్టి నష్టాల సంగతి మాట్లాడదాం. సినిమాకు దారుణమైన వసూళ్లు వస్తుండటంతో బయ్యర్లను ఆదుకునే పనిలో చిరంజీవి, రామ్‌చరణ్‌ పడ్డారని అంటున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమాకు చిరంజీవి రెమ్యూనరేషన్‌ తీసుకోలేదని రామ్‌చరణ్‌ చెప్పారు. అయినప్పటికీ ఏదో విధంగా బయ్యర్లకు అండగా నిలవాలని చూస్తున్నారట. ఆర్థికంగా ఆదుకోవడమా? లేక కొత్త సినిమాను వారికే ఇవ్వడమా అనేది ఆలోచిస్తున్నారట. త్వరలోనే దీనిపై ఓ నిర్ణయానికి వచ్చి వివరాలు వెల్లడిస్తారనే ప్రచారం సాగుతోంది.

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus