రానా ఓకే.. సాయి పల్లవికి ఏమైనట్టు?

తాజాగా ‘విరాటపర్వం’ షూటింగ్ మొదలైంది. రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి వేణు ఉడుగుల దర్శకుడు. గతంలో శ్రీవిష్ణు హీరోగా ‘నీదినాది ఒకే కథ’ అనే వైవిధ్యమైన చిత్రాన్ని తెరకెక్కించాడు వేణు. ఇప్పుడు రానాతో కూడా అటువంటి వైవిధ్యమైన కథనే తెరకెక్కించబోతున్నాడట. తెలంగాణా ప్రాంతంలో 1990 వ సంవత్సరం నాటి సామజిక పరిస్థితులు ప్రతిబింబించే పీరియాడిక్ సోషల్ డ్రామా ఈ చిత్రం రూపొందనుందని సమాచారం.

ఈ చిత్రాన్ని ఈ రోజు రామానాయుడు స్టూడియోస్‌లో లాంఛనంగా ప్రారంభించారు. ముహూర్తపు విక్టరీ వెంకటేష్,టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి ముఖ్య అతిథిలుగా విచ్చేసారు. అయితే హీరో రానా మాత్రం ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. హీరోయిన్ సాయి పల్లవి వచ్చినప్పటికీ.. కొద్దిసేపటికే వెళ్లిపోయింది. వారి సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉండటం వల్లే ఈ కార్యక్రమానికి తమ సమయం కేటాయించలేకపోయారని తెలుస్తుంది. ఇక వచ్చే వారం నుండీ ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus