అక్కినేని అఖిల్ కు (Akhil) ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉన్నా ఈ మధ్య కాలంలో అఖిల్ ఖాతాలో సరైన హిట్ లేదనే సంగతి తెలిసిందే. అఖిల్ తర్వాత సినిమా యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతుండగా ఈ సినిమా అంతకంతకూ ఆలస్యమవుతున్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్ నిర్మాతలు ప్రస్తుతం చిరంజీవి (Chiranjeevi) విశ్వంభర (Vishwambhara) సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా వల్లే అఖిల్ మూవీ ఆలస్యం అవుతున్నట్టు తెలుస్తోంది. విశ్వంభర సినిమా ప్రస్తుత షెడ్యూల్ పూర్తైన తర్వాత అఖిల్ సినిమా మొదలుకానుంది.
ఈ సినిమాకు ధీర అనే టైటిల్ ను పరిశీలిస్తుండగా ఆ టైటిల్ నే ఫిక్స్ చేస్తారో లేదో తెలియాల్సి ఉంది. సాహో (Saaho) సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన అనిల్ కుమార్ అనే వ్యక్తి ఈ సినిమా కోసం పని చేస్తున్నారని సమాచారం అందుతోంది. ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో మేకర్స్ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమా 80 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది.
పీరియాడికల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. అఖిల్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవడంతో పాటు మంచి లాభాలను అందించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అఖిల్ సినిమాల విషయంలో నాగార్జున (Nagarjuna) సైతం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని అఖిల్ సినిమాలు ష్యూర్ షాట్ హిట్ అయ్యేలా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.
అఖిల్ రెమ్యునరేషన్ 7 నుంచి 10 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. పాన్ ఇండియా డైరెక్టర్ల డైరెక్షన్ లో అఖిల్ నటిస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అఖిల్ కెరీర్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.