చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతోండగా రోజురోజుకు ఈ సినిమాకు కలెక్షన్లు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదనే సంగతి తెలిసిందే. సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. అయితే తాజాగా బన్నీ ఈ సినిమాను థియేటర్ లో చూసిన సంగతి తెలిసిందే. అభిమానులతో కలిసి బన్నీ వాల్తేరు వీరయ్య సినిమాను చూడటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
ప్రసాద్ ఐమ్యాక్స్ లో బన్నీ ఈ సినిమాను చూశారు. మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలు ఉన్నాయని ఈ మధ్య కాలంలో తరచూ వార్తలు ప్రచారంలోకి వస్తున్న నేపథ్యంలో ఆ వార్తలకు చెక్ పెట్టాలనే ఆలోచనతో అల్లు అర్జున్ ఈ సినిమాను థియేటర్ లో చూశారని సమాచారం అందుతోంది. చిరంజీవికి బన్నీ వీరాభిమాని అనే సంగతి తెలిసిందే. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా బన్నీ వాల్తేరు వీరయ్య సినిమాను చూడటం గురించి అభిమానులు సైతం పాజిటివ్ గా స్పందిస్తుండటం గమనార్హం.
ప్రస్తుతం బన్నీ పుష్ప2 సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా 1000 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంటుందని అభిమానులు భావిస్తుండటం గమనార్హం. బన్నీ ఫహద్ ఫాజిల్ కాంబినేషన్ లో వచ్చే సీన్లు ఎంతో బాగుంటాయని సమాచారం. సుకుమార్ ఆసక్తికర ట్విస్టులతో పుష్ప2 సినిమాను తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. బన్నీ రష్మిక కాంబో సీన్లు నెక్స్ట్ లెవెల్స్ లో ఉంటాయని సమాచారం అందుతోంది. బన్నీ మరిన్ని బ్లాక్ బస్టర్ హిట్లు అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్న బన్నీ సినిమా సినిమాకు హీరోగా తన స్థాయిని పెంచుకుంటూ ఆకట్టుకుంటున్నారు. బన్నీ రేంజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.