Bhagavanth Kesari: భగవంత్ కేసరి విషయంలో కళ్యాణ్ రామ్ సైలెన్స్.. కారణాలివేనా?

బాలయ్య హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన భగవంత్ కేసరి మూవీ ప్రభంజనం బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. ఫస్ట్ వీక్ కలెక్షన్లతోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ సినిమా గురించి జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదనే సంగతి తెలిసిందే. అయితే కళ్యాణ్ రామ్ అయినా ఈ సినిమా గురించి స్పందిస్తారని భావించిన ఫ్యాన్స్ కు నిరాశ ఎదురైంది. భగవంత్ కేసరి విషయంలో కళ్యాణ్ రామ్ సైలెన్స్ కు కారణం ఏంటనే ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది.

పొలిటికల్ రీజన్స్ వల్లే కళ్యాణ్ రామ్ సైలెంట్ గా ఉన్నారని తెలుస్తోంది.కళ్యాణ్ రామ్ త్వరలో డెవిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నవంబర్ నెల 24వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. పాన్ ఇండియా మూవీగా విడుదల కానున్న డెవిల్ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ లో కళ్యాణ్ రామ్ కు పర్సనల్ లైఫ్ కు సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యే ఛాన్స్ అయితే ఉంది.

కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన సినిమా కావడం ఈ సినిమాకు మరింత ప్లస్ అయింది. కళ్యాణ్ రామ్ సాధారణంగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటారు. సినిమా ప్రమోషన్స్ లో మాత్రమే కళ్యాణ్ రామ్ సందడి చేస్తూ ఉంటారు. కళ్యాణ్ రామ్ త్వరలో మరిన్ని ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని తెలుస్తోంది. తనకు సూట్ అయ్యే కథలకు కళ్యాణ్ రామ్ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుస్తోంది.

కళ్యాణ్ రామ్ రెమ్యునరేషన్ సైతం భారీ రేంజ్ లో ఉంది. కళ్యాణ్ రామ్ బింబిసార2 సినిమాకు సంబంధించి అప్ డేట్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కళ్యాణ్ రామ్ వరుసగా పాన్ ఇండియా హిట్లు సాధించి తన స్థాయిని మరింత పెంచుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. స్టార్ డైరెక్టర్స్ తో కళ్యాణ్ రామ్ పని చేస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus