Jamuna: జమున గురించి ఆ విమర్శల వెనుక అసలు కారణాలు ఇవేనా?

సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీల గురించి ప్రజల్లో, ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు ఉంటాయి. వేర్వేరు సందర్భాల్లో వాళ్లు ప్రవర్తించిన తీరును బట్టి ప్రజల్లో వాళ్లపై ఒపీనియన్ మారుతుంది. ప్రముఖ టాలీవుడ్ నటీమణులలో జమున ఒకరు కాగా ఈమె అద్భుతమైన నటిగా పేరును సంపాదించుకున్నా కొంతమంది దర్శకనిర్మాతలు ఆమె పొగరుబోతు అని భావించేవారు. వినడానికి ఒకింత ఆశ్చర్యంగా అనిపించినా కొందరు దర్శకనిర్మాతలు ఆమె గురించి ఇలా అనుకునేవారు. గ్లామర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న జమున తన సినీ కెరీర్ లో అన్ని రకాల పాత్రల్లో నటించి మెప్పించారు.

దాదాపుగా 25 సంవత్సరాల పాటు జమున నటిగా ఒక వెలుగు వెలిగారు. జమున నటన వల్లే హిట్టైన సినిమాల సంఖ్య కూడా తక్కువేం కాదు. ఒక ఘటన వల్ల జమున తండ్రి ఇబ్బంది పడగా ఆ తర్వాత తాను లేని సమయంలో ఇంటికి ఎవరొచ్చినా తలుపు తెరవద్దని జమునకు సూచించడం జరిగింది. తండ్రి అలా చెప్పడంతో జమున కూడా ఆయన చెప్పిన విధంగా చేశారు. ఇలా జరగడం వల్ల కొంతమంది దర్శకనిర్మాతలు ఇంటి దగ్గర వచ్చినా జమునను కలవలేకపోయేవారు.

ఈ విధంగా చెయ్యని తప్పుకు జమునపై పొగరుబోతు అనే ముద్ర పడింది. తెలుగుతో పాటు తమిళ సినిమాలలో కూడా జమున తనదైన ముద్ర వేశారు. ఒక తమిళ సినిమాలో కమల్ కు తల్లి పాత్రలో జమున నటించి మెప్పించారు. పణం పడత్తుం పాడు జమున నటించిన తొలి తమిళ సినిమా కాగా తమిళ స్టార్ హీరోలకు జోడీగా నటించి జమున సత్తా చాటారు.

తమిళంలో స్టార్ హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ ను అందుకున్న అతికొద్ది మంది నటీమణులలో జమున ఒకరు. వెండితెర సత్యభామగా పేరు తెచ్చుకున్న జమున గొప్పదనం గురించి ఎంత చెప్పినా తక్కువేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

హంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పఠాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సౌందర్య టు శృతి హాసన్.. సంక్రాంతికి రెండేసి సినిమాలతో పలకరించిన హీరోయిన్ల లిస్ట్..!
అతి తక్కువ రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టిన 10 తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus