ప్రస్తుతం దేశంలోనే ఎక్కువ మొత్తం పారితోషికం తీసుకుంటున్న స్టార్ హీరోగా ప్రభాస్ నిలిచారు. ప్రభాస్ ఒక్కో సినిమాకు 150 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో క్రేజ్, వరుసగా సక్సెస్ లు సాధించిన హీరోల రెమ్యునరేషన్ ప్రభాస్ రెమ్యునరేషన్ కు దరిదాపుల్లో కూడా లేదు. సాహో సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో నెగిటివ్ రివ్యూలు వస్తే బాలీవుడ్ లో మాత్రం సాహో సినిమాకు అంచనాలకు అందని స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి.
అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్ ఆధిపత్యానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. ఒక స్టార్ హీరోకు కావాల్సిన అన్ని లక్షణాలు ప్రభాస్ లో పుష్కలంగా ఉన్నాయి. తన నటనతో విమర్శకులను సైతం మెప్పించగల ప్రతిభ ప్రభాస్ సొంతమని చెప్పవచ్చు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి, బాహుబలి2 సినిమాల వల్ల బాలీవుడ్ లో ప్రభాస్ గురించి జోరుగా చర్చ జరిగింది. బాహుబలి లాంటి కఠినమైన పాత్రలనే సులువుగా పోషించిన ప్రభాస్ ఎలాంటి పాత్రలలోనైనా నటించగలనని ప్రూవ్ చేసుకున్నారు.
గతంలో పలువురు టాలీవుడ్ హీరోలు బాలీవుడ్ లో సత్తా చాటాలని ప్రయత్నాలు చేసినా ప్రభాస్ స్థాయిలో ఎవరూ గుర్తింపు తెచ్చుకోలేదు. దేశవిదేశాల్లో ప్రభాస్ కు ఊహించని స్థాయిలో క్రేజ్ ఉండటం వల్ల ప్రభాస్ అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు వెనుకడుగు వేయడం లేదు. బాలీవుడ్ మీడియా సైతం ప్రభాస్ గురించి పాజిటివ్ గానే కథనాలు ప్రసారం చేస్తుండటం ప్రభాస్ కు ప్లస్ అవుతోంది. బాహుబలి సిరీస్ వల్ల ఇతర స్టార్ హీరోలకు సాధ్యం కాని స్థాయిలో ప్రభాస్ క్రేజ్ ను పెంచుకున్నారు.
ప్రభాస్ భవిష్యత్తు ప్రాజెక్టులు సక్సెస్ సాధిస్తే మాత్రం ఈ హీరోకు పాపులారిటీ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది. ప్రభాస్ నటించిన రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాల కోసం బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో మార్కెట్ ను స్టడీగా కొనసాగిస్తూ ప్రభాస్ నంబర్ వన్ గా నిలుస్తున్నారు. ప్రభాస్ ఒక్కో సినిమాకు తీసుకుంటున్న రెమ్యునరేషన్ బాలీవుడ్ స్టార్ హీరోలను సైతం అవాక్కయ్యేలా చేస్తోంది.
Most Recommended Video
ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!