Prabhas: ప్రభాస్ ఆ ప్రాజెక్ట్ లో నటించడం వెనుక ఇంత కథ ఉందా?

  • May 10, 2024 / 08:42 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో డబ్బు కంటే మనుషులకు, విలువలకు, స్నేహానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే హీరో ఎవరనే ప్రశ్నకు ప్రభాస్ (Prabhas)  పేరు సమాధానంగా వినిపిస్తుంది. ప్రభాస్ పారితోషికం రోజుకు 2 నుంచి 3 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంటుంది. అయినప్పటికీ ఈ స్టార్ హీరో మాత్రం కన్నప్ప (Kannappa)  సినిమాకు పారితోషికం ఇస్తామని చెప్పినా తనకు రూపాయి కూడా పారితోషికం వద్దని చెప్పి ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

అయితే ప్రభాస్ భక్త కన్నప్ప సినిమాలో కన్నప్ప పాత్రలో నటించాలనేది ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు  (Krishnam Raju) కోరిక కాగా కన్నప్ప సినిమాలో మరో పాత్రలో నటించడం ద్వారా పెదనాన్న కోరికను కొంతైనా తీర్చినట్టు అవుతుందని ప్రభాస్ భావించారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. సలార్2 (Salaar)  సినిమా కంటే కన్నప్ప సినిమానే మొదట థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది.

ప్రభాస్ ఈ సినిమా కోసం 10 రోజుల డేట్లు కేటాయించారని తెలుస్తున్న సమాచారం ప్రకారం ప్రభాస్ పాత్రకు ఎక్కువగానే ప్రాధాన్యత ఉండనుందని తెలుస్తోంది. త్వరలో సలార్2 మూవీ షూట్ మొదలుకానున్న నేపథ్యంలో ప్రభాస్ మొదట ఈ సినిమా కోసం డేట్స్ కేటాయించారని తెలుస్తోంది. ప్రభాస్ కన్నప్ప సినిమాలో నటిస్తుండటంతో ఇతర భాషల్లో సైతం ఈ సినిమాకు భారీగానే బిజినెస్ జరగనుందని తెలుస్తోంది.

కన్నప్ప పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ సాధించాలని అభిమానులు ఫీలవుతున్నారు. కన్నప్ప సినిమా ఖర్చు విషయంలో మేకర్స్ ఏ మాత్రం రాజీ పడటం లేదని సమాచారం అందుతోంది. కన్నప్ప సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఇతర భాషలకు చెందిన ప్రముఖ నటులు నటిస్తుండటం నెట్టింట హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం. కన్నప్ప సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని సమాచారం అందుతోంది. ఈ సినిమా మంచు విష్ణుకు ఏ రేంజ్ హిట్ అందిస్తుందో చూడాల్సి ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus