Bheemla Nayak Movie: ‘భీమ్లా నాయక్’ కచ్చితంగా చూడడానికి గల 11 కారణాలు..!

పవన్ కళ్యాణ్- రానా దగ్గుబాటి ల కలయికలో తెరకెక్కిన మల్టీస్టారర్ ‘భీమ్లా నాయక్’. సాగర్ చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్య దే.వర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఫిబ్రవరి 25న అంటే మరికొన్ని గంటల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. థియేటర్ల వద్ద పవన్ అభిమానుల సందడి ఏ రేంజ్లో ఉందో మనం చూస్తూనే ఉన్నాం. ఆంధ్రాలో 5వ షోకి అనుమతి లేదు, తెలంగాణలో అనుమతులు ఇచ్చారు. తెల్లవారు జామున 3 గంటల నుండీ షోలు పడనున్నాయి. ఇదిలా ఉండగా.. ‘భీమ్లా నాయక్’ చిత్రాన్ని కచ్చితంగా చూడడానికి 11 ఆకర్షించే అంశాలు ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

1) ఎక్కువ ఆకర్షించే అంశం.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన సినిమాకి ఉండే క్రేజే వేరు. గతేడాది విడుదలైన ఆయన రీ ఎంట్రీ చిత్రం ‘వకీల్ సాబ్’ సెకండ్ లాక్ డౌన్ టైములో రిలీజ్ అయినా మంచి ఫలితాన్నే అందుకుంది. ఈసారి ‘భీమ్లా’ తో ఆయన పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాలని అంతా కోరుకుంటున్నారు.

2) మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ మూవీ ఇది. అందులో మాస్ ఆడియెన్స్ ను అలరించే అంశాలు ఎన్నో ఉన్నాయి. ‘భీమ్లా నాయక్’ లో కూడా కచ్చితంగా అవి ఉంటాయని అంతా భావిస్తున్నారు.

3) పవన్ – రానా కాంబినేషన్లో తెరకెక్కిన మల్టీస్టారర్ ఇది. ఈ మూవీలో ఇద్దరి పాత్రలు నువ్వా- నేనా అనే విధంగా ఉంటాయి. గతంలో వెంకీతో కలిసి పవన్ స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇప్పుడు రానాతో షేర్ చేసుకోవడం మరింత ఆసక్తిని పెంచుతుంది.

4) తమన్ బ్యాక్.. గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అభిమానులు. ‘వకీల్ సాబ్’ కు మంచి నేపధ్య సంగీతం అందించాడు. ‘లాల భీమ్లా’ రేంజ్లో నేపధ్య సంగీతం అందిస్తే ఇక అభిమానులకి పూనకాలే..!

5) త్రివిక్రమ్ సంభాషణలు… ఈ చిత్రానికి సాగర్ చంద్ర దర్శకుడు అయినప్పటికీ.. తెలుగు ప్రేక్షకులకి తగినట్టు ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ స్క్రిప్ట్ లో మార్పులు చేసింది ఈయనే. త్రివిక్రమ్ మార్క్ డైలాగుల కోసం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

6) నిత్యా మేనన్ : ట్రైలర్లో చూస్తే.. నిత్యా మేనన్ పెర్ఫార్మన్స్ కూడా ఓ రేంజ్లో ఉంటుందనే ఆశని కలిగిస్తుంది. కాబట్టి ఈమె పాత్ర కూడా ఆకర్షించే అంశమే..!

7) సంయుక్తా మేనన్ : ఈమె రానా సరసన నటించింది. ఈ భామ లుక్స్ అందరినీ ఆకట్టుకునే విధంగా కనిపిస్తున్నాయి. మరి పెర్ఫార్మెన్స్ ఏ రేంజ్లో ఇస్తుందో అనే ఆలోచన అందరిలోనూ ఉంది.

8) సముద్ర ఖని : ఈయన పాత్ర కూడా సినిమాలో చాలా కీలకమట. ‘అల వైకుంఠపురములో’ ‘క్రాక్’ సినిమాల రేంజ్లో ఈ సినిమాలో ఆయన పాత్ర ఉంటుందని అంతా భావిస్తున్నారు.

9) ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ లో కోషియమ్ ను భయపెట్టడానికి అయ్యప్పనుమ్ ఓ ఫైట్ చేస్తాడు. ఓ వ్యక్తి షాప్ కూల్చేసి అతన్ని చితక్కొడతాడు. ఆ ఫైట్ ‘భీమ్లా’ లో ఎలా ఉంటుంది అనే ఆసక్తి అందరిలోనూ ఉంది.

 

10) 2022 లో వస్తున్న మొదటి పెద్ద సినిమా బాస్ ఇది. ఈ ఏడాది ఇంకా సరైన బ్లాక్ బస్టర్ పడలేదు.’భీమ్లా నాయక్’ ఆ లోటుని తీరుస్తుందని అంతా భావిస్తున్నారు చూద్దాం.

11)’అత్తారింటికి దారేది’ తర్వాత పవన్ నుండీ వచ్చిన సినిమాల్లో ఒక్కటి కూడా బ్రేక్ ఈవెన్ సాధించలేదు. ‘భీమ్లా నాయక్’ బ్లాక్ బస్టర్ అవ్వడమే కాకుండా ‘బాహుబలి2’ పేరు పై ఉన్న రికార్డులని బ్రేక్ చేస్తుందని అంతా ఆశపడుతున్నారు.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus