Varasudu: విజయ్ సినిమాకి వందల కోట్లలో బిజినెస్!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం ‘వారసుడు’ అనే సినిమాలో నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాను వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్నారు. తమిళంలో ఈ సినిమాకి ‘వరిసు’ అనే టైటిల్ పెట్టారు. మొదట ఈ సినిమాను బైలింగ్యువల్ అని చెప్పినప్పటికీ.. ఇప్పుడు మాత్రం ఇది తమిళ సినిమా అని.. తెలుగులో డబ్ చేస్తున్నామని అంటున్నారు. ఏదైతేనేం సినిమాకి బిజినెస్ మాత్రం ఓ రేంజ్ లో జరుగుతోంది. నిజానికి తెలుగులో ఈ సినిమాపై పెద్దగా బజ్ లేదు.

పైగా సంక్రాంతికి సినిమా వస్తుందని అనౌన్స్ చేశారు. అదే సమయానికి ప్రభాస్ ‘ఆదిపురుష్’, చిరంజీవి ‘వాల్తేర్ వీరయ్య’, బాలయ్య ‘వీరసింహారెడ్డి’ వంటి సినిమాలు ఉన్నాయి. ఇన్ని క్రేజీ సినిమాల మధ్య విజయ్ సినిమా నలిగిపోయే ప్రమాదం ఉంది. కానీ తమిళంలో మాత్రం ఈ సినిమాపై క్రేజీ బజ్ ఏర్పడింది. దానికి తగ్గట్లే సినిమా బిజినెస్ కూడా జరుగుతుంది. అందుతున్న సమాచారం ప్రకారం.. తమిళంలో ‘వరిసు’ సినిమా థియేట్రికల్ హక్కులను రూ.72 నుంచి రూ.75 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది.

అలానే ఓవర్సీస్ హక్కులను ఫార్స్ ఫిలిమ్స్ సంస్థ రూ.38 కోట్లు పెట్టి దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అక్కడ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 10 మిలియన్ల డాలర్స్ ను వసూలు చేయాల్సి ఉంటుంది. ఇదివరకు విజయ్ నటించిన ‘మెర్సల్’, ‘బిగిల్’ వంటి సినిమాలు అంతకుమించే వసూలు చేయడంతో విజయ్ సినిమాకి ఈ రేటు వచ్చింది. ఈ సినిమా కోసం దిల్ రాజు మొత్తం రూ.250 కోట్లు ఖర్చు పెట్టినట్లు చెబుతున్నారు.

ఇప్పుడు మొత్తం థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ రైట్స్ కలుపుకొని రూ.280 కోట్ల వరకు బిజినెస్ జరిగిందట. ఈ మొత్తం తెలుగు థియేట్రికల్ రైట్స్ ను కలపకుండా వచ్చింది. ఆ లెక్కన చూసుకుంటే విజయ్ సినిమా భారీ డీల్ ను క్లోజ్ చేసిందనే చెప్పాలి. రష్మిక హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో రాధికా శరత్ కుమార్, సంగీత వంటి తారలు నటిస్తున్నారు.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus