సూపర్ స్టార్ రజినీకాంత్ ఏడుపదుల వయసులో కూడా ఎంతో చలాకీగా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు తాజాగా ఈయన నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు అయితే ఈ సినిమా ఊహించని స్థాయిలో సక్సెస్ అందుకొని నిర్మాతలకు భారీ లాభాలను అందిస్తుంది. ప్రతి ఒక్క భాషలోనూ విపరీతమైన ఆదరణ సంపాదించుకున్నటువంటి ఈ సినిమా సుమారు 650 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. జైలర్ సినిమా తెలుగు హక్కులు కేవలం రూ. 12 కోట్లకు కొనుగోలు చేశారు. రూ. 75 కోట్ల గ్రాస్ రాబట్టింది.
జైలర్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 122 కోట్లు కాగా ఈ సినిమా ఏకంగా 650 కోట్ల కలెక్షన్లను రాబట్టింది అంటే ఏ స్థాయిలో లాభాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు ఇలా ఈ సినిమాకు భారీ స్థాయిలో లాభాలు రావడంతో ఈ సినిమా నిర్మాత కళానిధి మారన్ రజినీకాంత్ ని కలిశారు. ఈ విధంగా రజనీకాంత్ ను కలిసినటువంటి ఈయన ఆయనకు రెమ్యూనరేషన్ చెక్కు రూపంలో అదనంగా మరో 100 కోట్ల రూపాయలు అందచేసారని సమాచారం.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే ఇదివరకే జైలర్ సినిమా కోసం రజనీకాంత్ 110 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నారు. ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో నిర్మాత మరో 100 కోట్ల రూపాయలు అదనంగా ఇచ్చినట్టు సమాచారం. ఇలా 100 కోట్ల రూపాయలు అధికంగా రెమ్యూనరేషన్ అందుకు ఉన్నటువంటి రజనీకాంత్ ఈ సినిమాకు ఏకంగా 250 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నట్టు సమాచారం.
ఇలా రెమ్యూనరేషన్ విషయంలో స్టార్ హీరోలు అందరిని బీట్ చేసి ముందు వరుసలో నిలిచారు. సౌత్ ఇండస్ట్రీలో ప్రభాస్ హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకొనే హీరోగా పేరు పొందారు. ఈయన ఒకో సినిమాకు 150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోగా ఇప్పుడు రజనీకాంత్ (Rajinikanth) ఈ రికార్డును బ్రేక్ చేస్తూ ఏకంగా 210 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నారని తెలుస్తోంది.