రాక రాక వచ్చిన బాలీవుడ్ అవకాశం కోసం ఫెయిల్ అయ్యింది
- February 4, 2019 / 07:34 AM ISTByFilmy Focus
ఇప్పుడంటే ఆమెను పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదు కానీ.. ఒక రెండేళ్ల క్రితం వరకూ అందరూ కావాలనుకున్న కథానాయకి రెజీనా కసాండ్ర. తెలియక చేసిన కొన్ని తప్పుల వల్ల ఫేడవుట్ హీరోయిన్ అయిపోయింది. అమ్మడికి హిట్ పడి చాలా రోజులవుతోంది. పాపం తెలుగులో వర్కవుట్ అవ్వడం లేదన్న బాధతో తమిళంలో తన అందచందాలను ఏమాత్రం దాచుకోకుండా చేసిన చంద్రమౌళి కూడా బాక్సాఫీస్ దగ్గర దెబ్బకొట్టింది. ఇక ఇదంతా కాదని బాలీవుడ్ కి వెళ్లిపోయింది రెజీనా. నిజానికి ఒక రెండేళ్ల క్రితమే రెజీనా బాలీవుడ్ కి వెళ్లాల్సి ఉండగా..
- ఒక రాత్రికి కోటి ఇస్తారట : సాక్షి చౌదరి
- ‘సూసైడ్ చేసుకోవాలనుకున్నా’… అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన జయప్రద.
- ‘మహర్షి’ చిత్రానికి పూజా హెగ్దే రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
ఆమె సైన్ చేసిన మొదటి సినిమా “ఆంఖే 2” మొదలవ్వకుండానే ఆగిపోయింది. దాంతో గత వారం విడుదలైన “ఏక్ లడకీ కో దేఖాతో ఐసా లాగా”తో ఎంట్రీ ఇచ్చింది రెజీనా. ఈ చిత్రంలో కాస్త డేర్ చేసి లెస్బియన్ రోల్ ప్లే చేసింది. అయినప్పటికీ.. అమ్మడికి పెద్దగా ఉపయోగం లేకపోయింది. సినిమాకి మినిమమ్ ఓపెనింగ్స్ కూడా రాలేదు. దాంతో తెలుగు, తమిళ భాషల్లో మాత్రమే కాక బాలీవుడ్ లోనూ ఫెయిల్ అవ్వడంతో.. ఇప్పుడు ఏం చేయాలో తెలియని కన్ఫ్యూజన్ లో ఉంది రెజీనా. మరి అమ్మడి పరిస్థితిని గుర్తించి మన తెలుగు దర్శకనిర్మాతలెవరైనా పిలిచి అవకాశం ఇస్తారేమో చూడాలి.















