సినిమా ఇండస్ట్రీ అన్నాక రూమర్లు చాలా కామన్. కాకపోతే.. ఒక్కోసారి ఆ రూమర్లు నిజం కూడా అయిపోతుంటాయి. అందులోనూ ఒకట్రెండు సినిమాల్లో కలిసి నటించిన హీరోహీరోయిన్ల ఎఫైర్ గురించి వార్తలు రావడం అనేది చాలా కామన్. ఆ తరహాలోనే రెజీనా-సందీప్ కిషన్ ల మీద బోలెడన్ని రూమర్స్ వచ్చాయి. సందీప్ తో కలిసి “రొటీన్ లవ్ స్టోరీ, రారా కృష్ణయ్య, నక్షత్రం, నగరం” లాంటి చిత్రాల్లో కలిసి నటించింది రెజీనా. ఆఫ్ ది స్క్రీన్ కూడా వాళ్ళు క్లోజ్ గా ఉంటుంటారు. దాంతో ఈ ఇద్దరి నడుమ ఎఫైర్ నడుస్తోందని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారని వార్తలొచ్చాయి.
నిన్నమొన్నటివరకూ ఆ వార్తలను లైట్ తీసుకున్న రెజీనాకు.. ఇదే విషయం గురించి ఏకంగా బాలీవుడ్ మీడియా ప్రశ్నించడంతో ఇలా వదిలేస్తే ఇంకా వ్యాపించవచ్చని గ్రహించి వెంటనే.. “అతనితో నాకు అలాంటి రిలేషన్ ఏమీ లేదు. ఒక మంచి ఫ్రెండ్ & కో యాక్టర్ మాత్రమే. ఒకవేళ నేను ఎవర్నైనా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటే ముందు మీకే చెప్తాను” అని సమాధానమిచ్చింది. దాంతో కొంతవరకూ రూమర్లు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ.. మొత్తానికి ఆగిపోవడం మాత్రం కష్టమే.