టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని నెలల క్రితం క్యాస్టింగ్ కౌచ్ గురించి ఎక్కువగా వార్తలు ప్రచారంలోకి వచ్చాయనే సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు హీరోయిన్లు క్యాస్టింగ్ కౌచ్ గురించి తమ అభిప్రాయాలను వ్యక్తం చేయగా ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన రెజీనా సైతం తాజాగా క్యాస్టింగ్ కౌచ్ గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో మూవీ ఆఫర్ల కోసం కొంతమందిని సంప్రదించానని ఆమె తెలిపారు. ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి మూవీ ఛాన్స్ ఇస్తానని అయితే అడ్జస్ట్ మెంట్ కు ఓకే చెప్పాలని కోరాడని ఆమె అన్నారు.
పదేళ్ల క్రితం ఈ ఘటన జరిగిందని రెజీనా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో నా వయస్సు 20 సంవత్సరాలు అని ఆమె అన్నారు. ఆ వ్యక్తి మాట్లాడిన మాటల విషయంలో నాకు సరైన అవగాహన లేదని రెజీనా కామెంట్లు చేశారు. పారితోషికం విషయంలో అడుగుతున్నారని భావించి నా మేనేజర్ నీతో మాట్లాడతాడని చెప్పి ఫోన్ కట్ చేశానని ఆమె తెలిపారు. మేనేజర్ ద్వారా నాకు ఆ తర్వాత అసలు విషయం అర్థమైందని రెజీనా అన్నారు.
ఫోన్ చేసిన వ్యక్తి వేరే రకమైన కోరిక కోరాడని తర్వాత తెలిసిందని రెజీనా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ఘటన తర్వాత మళ్లీ అలాంటి అనుభవం ఎదురుకాలేదని ఆమె అన్నారు. కొంతమంది హీరోయిన్లు ఈ తరహా ఘటనలను ఎదుర్కోవాల్సి వస్తుందని రెజీనా అభిప్రాయం వ్యక్తం చేశారు.
హీరోయిన్లు చెప్పే విషయాలలో కొన్ని నిజం ఉండవచ్చని కొన్ని అబద్ధాలు ఉండవచ్చని ఆమె కామెంట్లు చేశారు. నిజం ఏమిటో ఆయా హీరోయిన్లకు మాత్రమే తెలుసని రెజీనా అన్నారు. రెజీనా వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. సినిమా సినిమాకు రెజీనాకు క్రేజ్ పెరుగుతోంది. ప్రస్తుతం రెజీనా (Regina) పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారు.