సాధారణంగా హీరోయిన్లు కనిపిస్తే ప్రేమ, పెళ్లి అనే విషయాల గురించి ఆరా తీస్తుంటారు. ఒకప్పుడు హీరోయిన్ రెజీనాకు కూడా ఇలాంటి ప్రశ్నలే ఎదురయ్యేవి కానీ ఇప్పుడు మరో కొత్త ప్రశ్న ఆమెకి ఎదురవుతోంది. అదేంటంటే.. స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ ఎందుకు రావడం లేదని. దీనికి సమాధానం తనకు కూడా తెలియదని అంటోంది రెజీనా. మీడియా వారు మాత్రమే కాకుండా.. తన స్నేహితులు, కుటుంబసభ్యలు కూడా ఇదే అడుగుతుంటారని చెప్పిన ఆమె.. స్టార్ హీరోల సరసన ఎందుకు ఆఫర్లు రావడం లేదో తనకు కూడా అర్ధం కావడం లేదని స్పష్టం చేసింది.
ఒకప్పుడు ఈ విషయంలో చాలా బాధపడేదాన్ని అని చెప్పిన ఈ భామ.. ఇప్పుడు మాత్రం ఓటీటీ రాకతో తనకు ఆ బాధ లేదని అంటోంది. అంతేకాకుండా.. సినిమాల్లో డిఫరెంట్ రోల్స్ లో కనిపించే ఛాన్స్ లు వస్తుండడంతో.. బడా హీరోల కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదంటోంది. ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లకు బిగ్ స్టార్స్ తో నటించే అవకాశాలు రావడం లేదని.. అలాంటప్పుడు తననే ఎందుకు ప్రశ్నిస్తున్నారని అడుగుతోంది ఈ బ్యూటీ.
రీసెంట్ గా ఈ బ్యూటీ నటించిన ‘చక్ర’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ఆమె లీల అనే విలన్ రోల్ లో కనిపించి మెప్పించింది. ఈ క్యారెక్టర్ తనకు మంచి పేరు తీసుకొచ్చిందని చెబుతోంది రెజీనా. ప్రస్తుతం రెజీనా.. మెగాస్టార్ నటిస్తోన్న ‘ఆచార్య’ సినిమాలో ఐటెం సాంగ్ లో కనిపించనుంది.
Most Recommended Video
చెక్ సినిమా రివ్యూ & రేటింగ్!
అక్షర సినిమా రివ్యూ & రేటింగ్!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!