మలయాళంలో పదుల సంఖ్యలో సినిమాల్లో నటించిన ఉన్ని రాజన్ మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ప్రముఖ నటుడు రాజన్ పీ దేవ్ కుమారుడే ఈ ఉన్ని రాజన్. రాజన్ పీ దేవ్ తెలుగులో విలన్ గా చాలా సినిమాలు చేశారు. ‘ఖుషి’, ‘ఆది’ ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఆయన కుమారుడు ఉన్ని రాజన్ కూడా మలయాళ ఇండస్ట్రీలో నటుడిగా రాణిస్తున్నాడు. ఇదిలా ఉండగా, ఉన్ని రాజన్.. ప్రియాంక అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
అయితే కొన్నాళ్లకే వీరిమధ్య విబేధాలు వచ్చాయి. ఇప్పుడు ప్రియాంక ఏకంగా ఆత్మహత్య చేసుకొని చనిపోవడం మలయాళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. వరకట్న వేధింపుల కారణంగానే ప్రియాంక మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రియాంక కుటుంబ సభ్యులు ఉన్ని రాజన్ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉన్ని రాజన్.. తన భార్యను దారుణంగా హింసించేవాడని.. వేధింపులకు పాల్పడడంతో పాటు ప్రియాంకను కొట్టేవాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఉన్ని రాజన్ తన ఖర్చుల కోసం ప్రియాంక నగలు అమ్మేశాడని..
అలానే ప్రియాంక తల్లి దగ్గర నుండి భారీ మొత్తంలో డబ్బు తీసుకున్నాడని చెబుతున్నారు. శారీరకంగా హింసిస్తున్నా.. మొదట్లో ఆ బాధను భరించిందని, తమకు కూడా ఆ విషయాన్ని చెప్పలేదని.. వేధింపులు ఎక్కువవుతుండడంతో పోలీస్ కంప్లైంట్ చేసిందని ప్రియాంక కుటుంబ సభ్యులు చెబుతున్నారు. స్టేషన్ లో భర్తపై కేసు పెట్టిన మరుసటిరోజే ఆత్మహత్యకు పాల్పడింది ప్రియాంక. ఈ మృతిపై కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Most Recommended Video
థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!