మరీ ఇంత సైలెంట్ అయితే ఎలాగయ్యా

  • January 27, 2018 / 01:46 PM IST

మధ్యలో వచ్చిన ‘శంకరాభరణం’ అనే చిత్రాన్ని పక్కనపెట్టేస్తే నిఖిల్ వరుస హిట్స్ తో, ఆల్మోస్ట్ ప్రతి చిత్రంతో బ్లాక్ బస్టర్ స్థాయి హిట్ కొడుతూ ముందుకెళుతున్నాడు నిఖిల్. ఆఖరికి అత్యంత సాధారణ కథతో తెరకెక్కిన “కేశవ” సినిమా హిట్ అయ్యిందంటే అందుకు కారణం హీరో నిఖిల్ మీద ఆడియన్స్ కి ఉన్న నమ్మకమే. అలాంటి వరుస హిట్స్ హీరో సినిమా వస్తుందంటే హడావుడి ఎలా ఉండాలి. కానీ విచిత్రంగా మినీ నాని లాంటి నిఖిల్ సినిమా ఒకటి రిలీజ్ కి రెడీగా ఉందని, ఫిబ్రవరి 9న ఆ సినిమా రిలీజవుతుంది అనే విషయం నిఖిల్ వీరాభిమానులకు కూడా తెలియదు.

కన్నడలో సూపర్ హిట్ అయిన “కిర్రిక్ పార్టీ” చిత్రాన్ని తెలుగులో “కిరాక్ పార్టీ”గా రీమేక్ చేస్తున్నారు. శరణ్ కొప్పిశెట్టి అనే కొత్త డైరెక్టర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం నిఖిల్ స్నేహితులు చందు మొండేటి, సుధీర్ వర్మలు కూడా వర్క్ చేస్తుండడం విశేషం. అంతమంది ప్రముఖులు పనిచేస్తున్న “కిరాక్ పార్టీ”కి సంబంధించిన టీజర్ తోపాటు ఒక సాంగ్ కూడా రిలీజైందనే విషయం ఎవరికీ తెలియలేదు. నెక్స్ట్ పబ్లిసిటీ కూడా ఇదే లేవల్లో ఉంటే అసలు సినిమా రిలీజ్ కూడా ఎవరికీ తెలియకుండాపోతుంది. నిఖిల్ ఇప్పటికైనా కాస్త తన మునుపటి సినిమాల తరహాలో ప్రమోషన్స్ లో పాలుపంచుకొంటే సినిమా అందరికీ రీచ్ అవుతుంది లేదంటే అంతే సంగతులు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus