Balakrishna Remuneration: ‘అన్‌స్టాపబుల్‌’ షోకి బాలకృష్ణకు ఎంతిస్తున్నారంటే…!

‘అన్‌స్టాపబుల్‌’ అంటూ నందమూరి బాలకృష్ణ త్వరలో ‘ఆహా’లోకి దబడి దిబిడి చేయబోతున్నాడు. తొలిసారిగా టాక్‌ షోతో అలరించబోతున్నాడు. ఈ షో ఎలా ఉంటుంది, ఎవరెవరు తమ అనుభూతులు పంచుకోవడానికి వస్తారు లాంటి విషయాల కోసం అభిమానులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. దీనిపై రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. అందులో ఏది క్లారిటీ ఉందో తెలియదు. ఈ క్రమంలో బాలయ్య పారితోషికం గురించి బజ్‌ వినిపిస్తోంది. ముందు ఇప్పటికే వచ్చిన రూమర్ల గురించి చూద్దాం. ఈ షో 12 ఎపిసోడ్లు ఉంటుందని సమాచారం.

అందులో భాగంగా తొలి ఎపిసోడ్‌ను ఘనంగా ప్రారంభించాలని ‘ఆహా’ టీమ్‌ అనుకుంటోంది. ఇందులో భాగంగా మోహన్‌బాబు లేదా చిరంజీవితో షో ప్రారంభించాలని అనుకుంటున్నారట. అయితే ఒకరు తొలి ఎపిసోడ్ మరొకరు ఆఖరి ఎపిసోడ్‌ అనే టాక్‌ కూడా నడుస్తోంది. ఇది పక్కనపెడితే… అసలు విషయం రెమ్యూనరేషన్‌. షో కోసం బాలయ్య ఎపిసోడ్‌కి ₹40 లక్షల నుండి ₹50 లక్షల వరకు తీసుకుంటున్నాడట. ఆ లెక్కన 12 ఎపిసోడ్లకు ₹ఐదు కోట్ల నుండి ₹ఆరు కోట్ల వరకు ఈ వసూలు ఉండొచ్చు అని టాక్‌.

దీనిపై ఇప్పటివరకు అయితే క్లారిటీ లేదు, భవిష్యత్తులో క్లారిటీ రాదు కూడా. కాబట్టి పుకార్లను నమ్మితే బాలయ్య టాక్‌ షో రెమ్యూనరేషన్‌ సుమారు ₹ఆరు కోట్లు. అదన్నమాట లెక్క.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus