Pushpa2 : ‘పుష్ప 2’ కి ఆ ఇద్దరి రెమ్యూనరేషనే అంత భారీగానా..!

2020 లో ‘అల వైకుంఠపురములో’ మూవీతో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టిన బన్నీ.. 2021 లో కూడా అదే స్థాయి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. అయితే ఈసారి పాన్ ఇండియా సక్సెస్ అందుకుని సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప ది రైజ్’ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. కలెక్షన్లు కూడా అంతంత మాత్రంగానే వచ్చాయి. కానీ హిందీలో భారీ వసూళ్లు సాధించాయి.

Click Here To Watch NOW

తమిళ, మలయాళం, కన్నడ, ఓవర్సీస్ లో కూడా బ్రేక్ ఈవెన్ సాధించి బన్నీని పాన్ ఇండియా హీరోని చేసాయి. దర్శకుడు సుకుమార్ అంటే సూపర్ హిట్ అనే బ్రాండ్ పడిపోయింది. వీళ్ళిద్దరి కాంబినేషన్లో ‘పుష్ప 2’ కూడా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో బడ్జెట్ కూడా భారీ స్థాయిలో కేటాయిస్తున్నారు నిర్మాతలు. కేవలం ఇద్దరి పారితోషికాల రూపంలోనే ఈ మూవీకి రూ.150 కోట్ల భారీ బడ్జెట్ అవుతుందట.

ఇందులో అల్లు అర్జున్ కు అత్యంత భారీగా రూ.100 కోట్లు పారితోషికం చెల్లిస్తున్నారట. నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో వచ్చే లాభాల్లో కూడా వాటా అడుగుతున్నాడు బన్నీ. సో మొత్తంగా అతనికి రూ.100 కోట్లు వెళ్తుంది. ఇక దర్శకుడు సుకుమార్ కు రూ.50 కోట్లు వెళ్తుందట. ఇది కేవలం ఇద్దరి పారితోషికాల లిస్ట్. రష్మిక, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ.. వంటి వారి లెక్క కూడా తక్కువగా ఏమీ ఉండదు. కాబట్టి దగ్గర దగ్గర్లో పారితోషికాలకే ‘పుష్ప’ నిర్మాతలు రూ.200 కోట్లు పెట్టాల్సి ఉంటుంది.

ఈ మొత్తంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ ని కంప్లీట్ చేశాడు. ఆ మూవీ కూడా గ్రాండ్ గానే ఉంటుంది. అయితే సుకుమార్ రాజీ పడని మనస్తత్వం టెక్నికల్ టీం కు ఇంకా ఎక్కువ పెట్టేలా చేస్తుందని ఇండస్ట్రీ పెద్దలు చెబుతున్నారు. మరి ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు ‘పుష్ప 2’ కి ఇంకెంత పెడతారో చూడాలి..!

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus