కరోనా తర్వాత టాలీవుడ్‌లో హిట్టు బొమ్మలు కొన్ని వచ్చాయి. అయితే వాటిలో ‘వకీల్‌సాబ్’ చాలా ప్రత్యేకం. ఇండస్ట్రీలో అగ్ర హీరోకు హిట్ పడితే వచ్చే కిక్కే అది. దాంతోపాటు పవన్ రీఎంట్రీ సినిమా కావడమూ ఓ కారణం. దీంతో సినిమాకు మంచి వసూళ్లే వచ్చాయి. సినిమాకు పవన్ కల్యాణ్‌కు అంతిచ్చారు, ఇంతిచ్చారు అంటూ రకరకాల వార్తలు వచ్చాయి. అయితే పవన్‌కు ₹50 కోట్లు ఇచ్చారని మాత్రం గట్టిగా వినిపిస్తోంది. అఫీషియల్ నెంబర్స్ ఎలాగూ బయటకురావు కాబట్టి. అంచనాగా తెలిసిన మిగిలిన లెక్కలు కూడా చూద్దాం!
సినిమాలో పవన్ కల్యాణ్ తర్వాత కీలక పాత్రలు అంటే ప్రకాశ్ రాజ్ నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల అని చెప్పుకోవాలి. ఆ తర్వాత స్థానం శ్రుతిహాసన్‌దే. రెమ్యూనరేషన్లు అయితే హీరోయిన్ల కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. శ్రుతి హాసన్‌కు ₹45 లక్షలుగా ఇవ్వగా, నివేదా థామస్‌కు ₹35 లక్షలు ఇచ్చారట. ఇక అంజలి ₹30 లక్షలు తీసుకోగా, కొత్తమ్మాయి అనన్య నాగళ్లకు ₹6 లక్షలు ఇచ్చారని టాక్. అయితే దీనికి గల కారణాలు కూడా మనకు తెలిసిందే.
స్టార్ హీరోయిన్ కాబట్టి చిన్న పాత్ర అయినా శ్రుతి హాసన్కు అంతిచ్చారు. అంజలితో పోలిస్తే నివేదా పాత్ర కానీ, ఫేమ్ కానీ ఇప్పుడు కాస్త ఎక్కువే అందుకే నివేదాకు అంజలి కంటే ₹5 లక్షలు ఎక్కువ అని అంటున్నారు. ఇక అనన్య సంగతి ముందే చెప్పుకున్నాంగా. అయితే ఇందులో అంజలి మరో జాక్‌పాట్ కొట్టిన విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ‘ఎఫ్ 3’లో అవకాశం సంపాదించింది. దీంతో నలుగురు నాయికల్లో అంజలికే ఎక్కువ వచ్చినట్లు.
Most Recommended Video
‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!