రెమ్యూనెరేషన్స్ విషయంలో అస్సలు తగ్గట్లేదంట..!

సౌత్ లో స్టార్ హీరోయిన్లెవరు అంటే టక్కున చెప్పే పేర్లు నయన తార, అనుష్క. వీరిద్దరిలో ప్రస్తుతానికి నయన్ ముందు వరుసలో ఉంది. స్టార్ హీరోల సినిమాల్లోనే కాకుండా వరుసగా లేడీ ఓరియెంట్ సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా ఉండడం… ఇక భారీ పారితోషికం అందుకోవడంతో ఈమె ఫస్ట్ అని చెప్పాలి. ఇక ఈమె స్టార్ హీరో సినిమా చేసినా.. లేడీ ఓరియెంటెడ్ సినిమా చేసినా పక్కాగా 6 కోట్ల పారితోషికం తీసుకుంటూ వస్తుందట. ఈ విషయంలో మాత్రం నయన్ అస్సలు తగ్గదట.

ఇక మన స్వీటీ విషయానికి వస్తే.. ‘బాహుబలి’ కి ముందు వరకూ కోటిన్నర వరకూ తీసుకుంటూ వచ్చిందట. కానీ ‘బాహుబలి’ తరువాత ఈమె క్రేజ్ డబుల్ అవ్వడంతో 5 కోట్ల వరకూ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందని తెలుస్తుంది. అయితే స్టార్ హీరో సినిమాకి అయితే 2 నుండే 2.5 కోట్లు మాత్రమే అడుగుతుందట. కానీ తాను నటించే లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి మంచి డిమాండ్ ఉంది కాబట్టి 5 కోట్ల వరకూ అడుగుతున్నట్టు తెలుస్తుంది. కానీ స్వీటీ ఈ విషయంలో చాలా బెటర్ అనే చెప్పాలి. ఎందుకంటే నయన్ 6 కోట్లు తీసుకుంటున్నప్పటికీ సినిమా ప్రమోషన్లకు హాజరు కాదు. పైగా అడ్వాన్స్ కూడా ఇస్తేనే ఓకే చేస్తుందట. కానీ అనుష్క అలా కాదు.. నిర్మాతలకు ఇచ్చిన మాట ప్రకారం సినిమా చేస్తుంటుందట. ఇక అనుష్క ప్రస్తుతం ‘నిశ్శబ్దం’ అనే చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

17 ఏళ్ళ కెరీర్లో ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాలేంటో తెలుసా..?
వయసుకు మించిన పాత్రలు చేసి మెప్పించిన టాలీవుడ్ హీరోలు..!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus