తనకి కాబోయే భర్త గురించి రేణు చెప్పకపోవడానికి కారణం ఇదే

కొన్ని విషయాలను మనం వదిలేసినా.. అవి మాత్రం మనల్ని పట్టుకునే ఉంటాయి. రేణు దేశాయ్ విషయంలోనూ అదే జరిగింది. ఆమె పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకొని వేరొకరి ప్రపంచంలో భాగమవుతున్నప్పటికీ బాధలు తప్పడం లేదు. పవన్ నుంచి విడిపోయి పిల్లలని పెంచింది. ఇప్పుడు తోడు కోరుకుంది. తనకి జీవితాంతం వెంటనడుస్తాడని నమ్మిన వ్యక్తిని పెళ్లి చేసుకోబోతోంది. రీసెంట్ గా నిశ్చితార్ధం చేసుకుంది. కానీ అతను ఎవరు? ఏమి చేస్తుంటారు ? కనీసం పేరు కూడా వెల్లడించలేదు? అంత రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏమి వచ్చిందని రేణు దేశాయ్ ని అడగగా ఆమె ఇలా సమాధానమిచ్చింది.

“గత ఏడాదే నేను మళ్లీ పెళ్లి గురించి చెప్పాను. పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను అనే విషయాన్ని మాత్రమే.. నేను చెబితే చాలా నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. “నిన్ను చంపేస్తాము .. నీ కాబోయే భర్తను చంపేస్తాము” అంటూ బెదిరింపులు వచ్చాయి. సోషల్ మీడియాలోని కామెంట్స్ ను పట్టించుకోవలసిన అవసరం లేదని చాలామంది చెప్పారు. కానీ అలా పట్టించుకోకుండా నేను ఉండలేకపోయాను. నాకు కాబోయే భర్తకు హాని కలగకూడదనే ఆయన ఎవరనేది నేను చెప్పలేదు.” అని వెల్లడించింది. చిత్రపరిశ్రమకి సంబంధించిన వ్యక్తి మాత్రం కాదని స్పష్టం చేసింది. పెళ్లి తర్వాత ఆయన ఎవరనేది చెబుతానని రేణు దేశాయ్ తెలిపింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus