‘బాహుబలి’ టీమ్‌కి చప్పట్ల మోత… మన దగ్గర కాదు ఎక్కడో నార్వేలో.. ఎలా అంటే?

‘బాహుబలి 1’ వచ్చి ఎనిమిదేళ్లు అవుతోంది, ‘బాహుబలి 2’ వచ్చి ఆరేళ్లు అవుతోంది. అయినా ఇప్పటికీ ఆ సినిమాలకు అదే స్థాయిలో ఆదరణ దక్కుతోంది అంటే నమ్ముతారా? కావాలంటే మీరే చూడండి ఆ సినిమా ప్రస్తావన వస్తే చాలు భారతీయ సినిమా ఇంకా చెప్పాలంటే తెలుగు సినిమా గౌరవం ఎవరెస్ట్‌ రేంజిలో కనిపిస్తుంది. అంతలా మన సినిమాను ఉన్నత స్థానానికి చేర్చారు ఎస్‌.ఎస్‌.రాజమౌళి. తాజాగా ఆ సినిమాను ఓ దగ్గర వేస్తే.. పది నిమిషాలపాటు ప్రేక్షకులు లేచి చప్పట్లు కొట్టారు.

ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు… రేణు దేశాయ్‌. ఇటీవల ‘బాహుబలి2 సినిమాను నార్వేలో ఓ థియేటర్‌లో ప్రత్యేకంగా వేశారట. అప్పుడే పైన చెప్పిన పది నిమిషాల స్టాండింగ్‌ ఒవేషన్‌ జరిగింది. నార్వేలోని స్టావెంజర్ థియేటర్లో ‘బాహుబలి’ సినిమాను ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి, ఆయన సతీమణి, కాస్ట్యూమ్‌ డిజైనర్‌ రమా రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డ, దర్శకుడు రాఘవేంద్రరావు హాజరయ్యారు. అలాగే ఆ షోకు రేణు దేశాయ్, అకీరా నందన్‌కి కూడా ఆహ్వానం అందిందట.

ఈ మేరకు అకీరాతో కలసి నార్వే వెళ్లారు రేణు. అక్కడి థియేటర్లో ‘బాహుబలి’ చూస్తూ పొందిన అనుభూతిని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ రాజమౌళిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు రేణు దేశాయ్‌. ఓ భారతీయ సినిమా ఇలా అంతర్జాతీయంగా గుర్తింపు పొందటం గర్వంగా ఉంది. ఈ ఆనందాన్ని మీతో పంచుకుంటున్నాను. ప్రేక్షకుల కోసం రాజమౌళి సృష్టించిన ఈ అనుభూతిని వర్ణించడానికి నోట మాట రావడం లేదు అంటూ గొప్పగా చెప్పారు రేణు దేశాయ్‌.

స్టావెంజర్ థియేటర్లో ‘బాహుబలి’ చూసిన ఫీలింగ్స్ ఎప్పటికీ మరచిపోలేను అంటూ ఆ ఫీలింగ్స్‌ని ఇంకా పెంచేశారు. ఇంతటి గొప్ప కార్యక్రమానికి ఆహ్వానం పంపినందుకు రాజమౌళికి, శోభు యార్లగడ్డకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు కూడా. ఇప్పుడు ఆమె మాటలు, వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus