Renu Desai : డాగ్స్ గురించిన ప్రెస్ మీట్ లో రేణు దేశాయ్ ఆ రేంజ్ లో ఫైర్ అవ్వటం ఎంత వరకు కరెక్ట్..?

తెలుగు రాష్ట్రాల్లో రేణు దేశాయ్ పేరు గురించి ప్రత్యేక పరిచయం లేదు. బద్రి సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత పవన్ కళ్యాణ్ తో వివాహం జరగటం ఇద్దరి పిల్లలకు తల్లి కావడం అందరికి తెల్సిన విషయమే.ఈ మద్యే సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన రేణు, నిన్న (19 జనవరి)న స్ట్రీట్ డాగ్స్ కు సంబందించిన ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు ఆమె. సాధారణంగా సున్నిత మనస్కురాలైన రేణుదేశాయ్ నిన్న ప్రెస్ మీట్ లో ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఆమె అంతలా ఆగ్రహానికి గురవ్వటానికి కారణాలు ఏంటో చూద్దాం రండి..

Renu Desai

రీసెంట్ గా ఒక దగ్గర పెద్ద సంఖ్యలో వీధి కుక్కలను మాస్ కిల్లింగ్ చేసిన సంగతి తెలిసి తాను చాలా కుంగిపోయానని తెలుపుతూ, తాను పాల్గొన్న ఒక టీవీ షోలో ఒక చిన్న బాలుడు డెంగ్యూ తో చనిపోయాడని అంత మాత్రాన దానికి కారణమైన దోమలను అన్నిటిని చంపేస్తామా? అంటూ ప్రశ్నించింది. అదే విధంగా బయట చాలా అత్యాచారాలు జరుగుతున్నాయని, అది మగవాళ్లే చేస్తున్నారని, ఒకరు ఇద్దరు మగవాళ్ళు తప్పు చేస్తే, మగవాళ్ళు అందరిని చంపేస్తున్నారా అని అన్నారు. ఇక పొతే బయట చాలా మందికి మనుషుల పట్ల ప్రేమ కంటే కుక్కల పట్ల కోపం,ద్వేషం,విరక్తి ఎక్కువగా ఉన్నాయన్నారు రేణు. తనకు కూడా నిజ జీవితంలో కొన్ని వీధి కుక్కల వల్ల జరిగే ప్రమాదాల గురించి అవగాహన ఉంది అని, అటువంటి ప్రమాదకార కుక్కలు ఇబ్బంది పెడితే తానూ నిర్వహిస్తున్న NGO కి తెలియజేస్తే, తనకి చేతనైనంత సహాయం అందిస్తానని తెలిపారు. అయితే, ఒక రిపోర్టర్ మీరు ఏసీ లో తిరుగుతారు మీకేం తెలుసు రోడ్లపై తిరిగేవారి బాధ అని కొంచం సీరియస్ గా ప్రశ్నిచటంతో ఆగ్రహంతో ఊగిపోయారు రేణు.

ఇది ఇలా ఉండగా, కొందరు నెటిజన్లు వీధి కుక్కల సమస్య మాటలు చెప్పినంత సులభంగా పరిష్కరించలేనిదని, వాటి బారిన పడిన వారికే ఆ సమస్యలోని తీవ్రత అర్ధం అవుతుందని చర్చించుకుంటుండగా, మరికొందరు రేణు ఆగ్రహంలో తప్పేమి లేదు, తన వంతు కృషి తాను చేస్తుందని మాట్లాడుకుంటున్నారు. ఈ వివాదం ఎంత దూరం వెళ్తుందో చూడాలి మరి..?

Prabhas: ‘ఫౌజీ’.. ఓ సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్న హాను!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus