Renu Desai: నన్ను ఇబ్బంది పెడితే తాట తీస్తా: రేణు దేశాయ్

వెండి తెరపై హీరోయిన్గా పలు సినిమాలలో నటించి అనంతరం మెగా ఇంటి కోడలుగా అడుగు పెట్టినటువంటి వారిలో నటి రేణు దేశాయ్ ఒకరు. పవన్ కళ్యాణ్ భార్యగా అందరికి సుపరిచితమైనటువంటి ఈమె పిల్లలు పుట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ తో వచ్చిన విభేదాలు కారణంగానే తనకు దూరంగా ఉంటున్నారు. మెగా కుటుంబానికి రేణు దేశాయ్ దూరంగా ఉన్నప్పటికీ తన పిల్లలు అకిరా ఆద్యానీ దగ్గర చేస్తూనే ఉన్నారు. మెగా కుటుంబంలో జరిగే కార్యక్రమాలకు వీరిద్దరూ హాజరవుతున్నారు.

ఇటీవల జరిగినటువంటి సంక్రాంతి సంబరాలలో కూడా మెగా కుటుంబ సభ్యులతో కలిసి అకిరా ఆద్య ఇద్దరు కూడా పాల్గొన్న విషయం మనకు తెలిసిందే. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఇలా తన పిల్లలు మెగా కుటుంబంతో కలిసి సంక్రాంతి సంబరాలు చేసుకోగ రేణు దేశాయ్ మాత్రం కేరళ వెళ్లి అక్కడ సంక్రాంతి సెలబ్రేషన్స్ జరుపుకున్నారు.

రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తరచూ తన పిల్లలకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకోవడమే కాకుండా ఇతర విషయాలన్నింటినీ కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఈమె పట్ల పలువురు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తూ తనని ట్రోల్ చేస్తూ ఉంటారు. ఇలా తన గురించి ట్రోల్ చేసేవారికి ఈమె తన స్టైల్ లోనే వార్నింగ్ ఇచ్చారు.

ఆద్య కరాటే నేర్చుకుంటున్నట్లు గతంలో వెల్లడించిన (Renu Desai) రేణు దేశాయ్ తాజాగా ఆద్య పంచ్‌లు విసురుతున్న వీడియోను షేర్‌ చేశారు. ఈ పోస్ట్‌కు క్యూట్‌ క్యాప్షన్‌ జత చేశారు. ఇకపై నన్ను ఎవరైనా ఇబ్బంది పెడితే నా పర్సనల్ సెక్యూరిటీ మీ తాట తీస్తుంది జాగ్రత్త అంటూ ఈమె ట్రోలర్స్ కు పరోక్షంగా ఇలా వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus