ఈసారి కూడా కాబోయే భర్తని చూపించని రేణుదేశాయ్!

నటి రేణు దేశాయ్ తీరు చూస్తుంటే.. అతడు సినిమాలోని  “వినిపించి వినిపించకుండా.. కనిపించి.. కనిపించకుండా.. చూపించి.. చూపించకుండా” అనే డైలాగ్ గుర్తొస్తోంది. ఎవరి మానాన వారు ఉంటే.. విమర్శల కోసం పిలిచి రెచ్చగొట్టినట్టు ఉంది ఆమె వైఖరి. తెలిసి చేస్తోందో.. తెలియక చేస్తోందో మనకి తెలియదు కానీ… తన కాబోయే భర్త గురించి ఎవరికీ తెలియకుండా చేస్తోంది. పవన్ కళ్యాణ్ తో విడిపోయిన తర్వాత రేణు దేశాయి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంటోంది. నిశ్చితార్ధం కూడా చేసుకుంది. అప్పుడు చేతులను మాత్రమే చూపించింది. ఎందుకు మొహం చూపించడం లేదని అడగగా  “నిన్ను చంపేస్తాము .. నీ కాబోయే భర్తను చంపేస్తాము” అంటూ బెదిరింపులు వచ్చాయని కారణంతో ఆయన ఎవరనేది చెప్పలేదంటూ వెల్లడించింది.

చిత్రపరిశ్రమకి సంబంధించిన వ్యక్తి మాత్రం కాదని స్పష్టం చేసింది. పెళ్లి తర్వాత ఆయన ఎవరనేది చెబుతానని రేణు దేశాయ్ తెలిపింది. ప్రస్తుతం  అమెరికా పర్యటనలో ఉన్న రేణు తాజాగా ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోని పోస్ట్ చేసింది. ఈ సారి అతని భుజం మాత్రమే కనిపించేలా జాగ్రత్త పడింది.  ఆ వ్యక్తి ముఖం దాచేసింది. స్టార్ హీరో సినిమా  ఫస్ట్ లుక్ రిలీజ్ కంటే ఎక్కువగా రేణు బిల్డప్ ఇస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అతను ఏ మాత్రం బాగా లేకపోతే మాత్రం రేణు దేశాయ్ ఈసారి ఇన్ స్ట్రాగ్రామ్ అకౌంట్ ని కూడా మూసుకోవాల్సి వస్తుందని విమర్శిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus