Renu Desai: వైరల్ అవుతున్న పవన్ ఆద్య సెల్ఫీ.. రేణూ దేశాయ్ ఏమన్నారంటే?

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)  ఇండిపెండెన్స్ డే సందర్భంగా తన కూతురు ఆద్యతో కలిసి దిగిన ఫోటో నెట్టింట తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ కాకినాడలో నిర్వహించిన కార్యక్రమానికి తన కూతురుతో కలిసి హాజరవ్వడం జరిగింది. స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో పవన్ కళ్యాణ్ జాతీయ జెండాను ఎగుర వేయడం గమనార్హం. పవన్ ఆద్య సెల్ఫీ ఫోటోలను రేణూ దేశాయ్ (Renu Desai) సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

Renu Desai

ఆద్య నాన్నతో కలిసి స్వాతంత్ర్య దినోత్సవానికి వెళ్లనా అని అడిగిందని నా కూతురు తండ్రితో సమయాన్ని గడపాలని అనుకోవడం, ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తుల లైఫ్ ఎలా ఉంటుందో చూడాలని అనుకోవడం నాకు ఆనందం కలిగించిందని రేణూదేశాయ్ చెప్పుకొచ్చారు. ఏపీ ప్రజల కోసం వాళ్ల నాన్న చేసే సేవలను ఆద్య అర్థం చేసుకుందని ఆమె తెలిపారు. పవన్ కళ్యాణ్ ను ఆద్య ప్రశంసించిందని రేణూ దేశాయ్ చెప్పుకొచ్చారు.

పవన్ కళ్యాణ్ ఆద్యల క్యూట్ సెల్ఫీ గురించి రేణూ దేశాయ్ చేసిన కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఇండిపెండెన్స్ డే రోజున అమరుల త్యాగాలను గుర్తు చేసుకోవాలని కామెంట్లు చేశారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహించాలని పవన్ వెల్లడించారు. అలాంటి బాధ్యతే నన్ను ఇక్కడ ఈ స్థాయిలో నిలబెట్టిందని పవన్ పేర్కొన్నారు.

కాకినాడకు చెందిన పలువురు స్వాతంత్ర్య సమరయోధులను పవన్ గుర్తు చేసుకోవడం గమనార్హం. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి సైతం పవన్ కళ్యాణ్ వెల్లడించడం గమనార్హం. పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ సినిమాల షూటింగ్స్ త్వరలో మొదలుకానున్నాయి. పవన్ ఈ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మోక్షజ్ఞ ఫస్ట్ మూవీకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్లాప్ కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus