రేణు దేశాయ్ గురించి ఏ న్యూస్ వచ్చినా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అలర్ట్ అయిపోతారు. ఎందుకంటే ఆమె ఏం మాట్లాడినా కొంత మంది నెటిజన్లు పవన్ కళ్యాణ్ కు లింక్ చేస్తూ కామెంట్స్ చేస్తారు కాబట్టి.
తాజాగా ఆమె ‘ఇతర మతాలను అవమానించడం ఫ్యాషన్ అయిపోయింది’ అంటూ చేసిన కామెంట్ ను కొంతమంది ‘హరిహర వీరమల్లు’ లింక్ చేస్తున్నారు. ఈ సినిమాలో కూడా మతాల టాపిక్ ఉంటుందన్న సంగతి తెలిసిందే.
ఇటీవల ఇస్కాన్ లోని ఓ రెస్టారెంట్ కి ఓ బ్రిటిషర్ వెళ్ళాడు. అతను వి-లాగర్. తన వద్దకు వచ్చిన వెయిటర్ తో ‘ ‘కె.ఎఫ్.సి’ ఉందా?’ అని అడిగాడు. అందుకు ఆ వెయిటర్..’ క్షమించండి ఇక్కడ అలాంటివి దొరకవు. వెజ్ ఫుడ్ మాత్రమే లభిస్తుంది.’ అని వినయంగా అతనికి సమాధానం ఇచ్చాడు. తర్వాత ఆ వి-లాగర్ తన బ్యాగ్ లో ఉన్న కె.ఎఫ్.సి బాక్స్ తీసుకుని అక్కడే తినడం స్టార్ట్ చేశాడు. దీంతో అక్కడి వారు ఇది పవిత్రమైన చోటు.. దయచేసి ఇలాంటివి ఇక్కడ తినొద్దు అంటూ వేడుకున్నారు. అయినా అతను వినలేదు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియో చూసిన రేణు దేశాయ్ స్పందించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘ఇతర దేశాలను, మతాలను, వారి నమ్మకాలను అగౌరపరచడం ప్యాషన్ అయిపోయింది. ఇలాంటి మూర్ఖులను కఠినంగా శిక్షించాలి’ అంటూ రేణు దేశాయ్ మండిపడింది. ఆమె కామెంట్స్ కు నెటిజన్లు కూడా మద్దతు తెలుపుతున్నారు.