అసభ్య కామెంట్లు చేసే వారికి వీడియోతో సమాధానం

  • October 5, 2019 / 04:04 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సోషల్ మీడియాలో అభిమానులకు అందుబాటులో ఉంటున్నారు. తన కొడుకు అకీరా, కూతురు ఆద్యకు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్ తో పంచుకుంటుంటారు. అయితే ఈ మధ్య కొందరు అసభ్యకరమైన పదజాలంతో రేణుని వేధిస్తున్నారు. వ్యక్తిగత విషయాల గురించి బాధ కలిగించే విధంగా పోస్టు చేస్తున్నారు. అటువంటి కామెంట్లు చేయెద్దు అంటూ ఎంత సున్నితంగా చెప్పిన వారిలో మార్పు రాలేదు. దీంతో అటువంటి సంస్కార హీనులకు అడ్డుకట్ట వేయాలని ఆమె అడుగు ముందుకేసారు.

వీడియో ద్వారా సమాధానం చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం గురించి ఆమె వివరిస్తూ.. “ఈ రోజు సాయంత్రం ఒక ముఖ్యమైన ఇంటర్వ్యూ ని పోస్ట్ చేస్తాను. అందులోని విషయాలు నన్ను ఆదరించి, నా మంచి కోరే అభిమానులను ఉద్దేశించింది కాదు. అది ఫేస్ బుక్, ట్విట్టర్ లో నా పర్సనల్ లైఫ్ గురించి వెకిలిగా ప్రవర్తిస్తున్న వారిని ఉద్దేశించింది. ఈ వీడియో చూసాక అయినా వాళ్లలో  మార్పు వస్తుందని ఆశిస్తున్నాను. నా నిజమైన అభిమానులకు కృతజ్ఞత రాలునే” అని బుధవారం పోస్ట్ చేస్తారు. ఆ వీడియో కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.


Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus