Renu Desai: ”మన శరీరం దానికోసమే కాదు కదా..”

సామాజిక సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తుంటుంది నటి రేణుదేశాయ్. తను చెప్పాలనుకునే విషయాన్ని సూటిగా చెప్పడం ఆమెకి అలవాటు. కరోనాతో ప్రజలంతా ఇబ్బంది పడుతున్న ఈ పరిస్థితుల్లో ఆమె పెట్టిన పోస్ట్ ఆకట్టుకుంటుంది. ”బాధలు, ద్వేషం వంటి వాటిని లెక్కలేనంతగా మోసి మనం గాడిదల్లా తయారవుతున్నాం. కానీ కేవలం భాధ పడటానికి ఈ శరీరం లేదు కదా.. బాధల్లో కూడా చిన్న చిన్న సంతోషాలను వెతుక్కొని ఆనందంగా ఉండాలి. మనమంతా ఇప్పుడు చావు, బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాం.

ఇలాంటి పరిస్థితుల్లో సంతోషంగా ఉండడానికి ఏది అవసరమో అది చేయండి. స్టాండప్‌ కామెడీ వీడియోలు కానీ, క్యూట్‌ పప్పీ వీడియోలు చూడండి. ఈ కష్టకాలం కూడా ఎక్కువ రోజులు ఉండదు అది వెళ్లిపోవాల్సిందే. అదే కాలానికి ఉన్న గొప్పదనం. అదే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. జాగ్రత్తలు పాటించండి. సురక్షితంగా ఉండండి” అంటూ తన మాటలతో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

సామాజిక దృక్ప‌థంతో రేణుదేశాయ్ పెట్టిన ఈ పోస్ట్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక ఆమె కెరీర్ విషయానికొస్తే.. డ్రామా జూనియర్స్ అనే షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. అలానే ఆద్య అనే వెబ్ సిరీస్‌తోనూ బిజీగా ఉన్నారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా వెబ్ సిరీస్ షూటింగ్ ను నిలిపివేశారు.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus