పిల్లల భవిష్యత్తు గురించి పవన్‌తో చర్చిస్తుండాలి – రేణు దేశాయ్

పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ జీవితంలో సినిమాలో కంటే ఎన్నో మలుపులున్నాయి. బద్రి చిత్రంతో పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ లు కలిశారు. సినిమాలో ప్రేమికులుగా నటించిన వీరిద్దరూ నిజజీవితంలో ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకోకుండా పిల్లలను కన్నారు. ఆ తర్వాత భార్య భర్తలు అయ్యారు. ఆ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. విడాకులు తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ మరో పెళ్లి చేసుకోవడంతో రేణు దేశాయ్ తన పిల్లతో పుణేలో ఉండేది. ఆమె ఒంటరితనం భరించలేక ఓ తోడుని చూసుకుంది. ఇటీవలే ఆమె నిచ్చితార్ధం కూడా జరిగింది. రెండవ వివాహంతో కొత్త జీవితం ప్రారంభిస్తున్న రేణు దేశాయ్ కు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత నెగిటివిటీ ఎక్కువ అయిందని రేణు ట్విట్టర్ కి గుడ్ బై చేప్పింది. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో లైవ్ లోకి వచ్చి అభిమానులతో ముచ్చటించింది.

వారి అడిగిన ప్రశ్నలకు ఓపిగా సమాధానం చెప్పింది. “పెళ్లి తర్వాత కూడా పవన్‌కల్యాణ్‌కు టచ్‌లోనే ఉంటారా” అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు రేణు ఆసక్తికర సమాధానం చెప్పింది. “తప్పకుండా. పెళ్లైన తర్వాత కూడా నేను పవన్‌కల్యాణ్‌తో టచ్‌లోనే ఉంటాను. నాకు వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే నా ఇద్దరి పిల్లలకు అతను తండ్రి. సెలవులు, ఇతర వేడుకల సందర్భంగా నా పిల్లలను తండ్రి దగ్గరకు పంపిస్తుండాలి. పిల్లల భవిష్యత్తు గురించి పవన్‌తో చర్చిస్తుండాలి” అని రేణు వివరించారు. తలిదండ్రలు విడిపోయినా ఆ ప్రభావం పిల్లలపై పడకూడదని పవన్, రేణు దేశాయ్ లు మంచి నిర్ణయాన్ని తీసుకున్నారని వారి అభిమానులు అభినందిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus