Renu Desai: వైరల్ అవుతున్న రేణు దేశాయ్ బోల్డ్ కామెంట్స్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్యగా .. ఇప్పుడు మాజీ భార్యగా ఆమె ఎంతో గుర్తింపు తెచ్చుకుంది రేణూ దేశాయ్ . ఇక దాదాపు 23 ఏళ్ళ తరువాత టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాతో రేణు రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ అందుకుంది. ఈ నేపథ్యంలోనే ఆమె ప్రమోషన్స్ లో పాల్గొంటూ వరుస ఇంటర్వ్యూలు ఇస్తుంది. సినిమా విషయాలతో పాటు, తన పర్సనల్ విషయాలు..

ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గురించి ఆమె ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ‘‘నేను ఎప్పుడు విడాకుల గురించి మాట్లాడినా.. నా మాజీ భర్త పవన్ కళ్యాణ్ అభిమానులు.. నేను వేరే పార్టీలకు అమ్ముడుపోయాను అని చెప్పుకొచ్చేవారు. పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ గా మాట్లాడితే .. ఈ పార్టీకి అమ్ముడుపోయాను అని చెప్పుకొస్తున్నారు’’ అంటూ నవ్వేసింది. “పవన్ కళ్యాణ్.. రాజకీయ నాయకుడు కావాలనుకున్నారు. ప్రపంచంలో ఎవరైనా ఆయన గురించి కామెంట్ చేయొచ్చు. మేనిఫెస్టో బాగోలేదని, ఆయన మాట్లాడే మాటలు బాగోలేవని.. స్పీచ్ లు బాగోలేవని తిట్టండి..

కానీ అందులోకి కుటుంబాన్ని లాగకండి” అని చెప్పింది. ఇక రేణు క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడిన కామెంట్స్ గురించి ఆమె చెప్తూ.. ‘‘ఒక కుటుంబం పరువు మొత్తం ఒక మహిళ రెండు కాళ్ల మధ్య ఉంటుంది అంటే.. అది చాలా దురదృష్టం. నా నటన గురించి కానీ, నా డ్రెస్సింగ్ గురించి కానీ కామెంట్ చేయకుండా.. ఎంతమందితో పడుకుంది.. ఇలా చేసింది.. అలా చేసింది అని క్యారెక్టర్ తో వెళ్ళిపోతారు.. అది పద్దతి కాదు” అని రేణు (Renu Desai) చెప్పుకొచ్చింది.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus