తెలుగు సినిమాకి స్క్రిప్ట్ రాసే పనిలో రేణు దేశాయ్

బద్రి సినిమాతో రేణు దేశాయ్ యువత హృదయాలను కొల్లగొట్టింది. తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత జానీలో డీ గ్లామర్ గా కనిపించింది. పవన్ కళ్యాణ్ తో సహజీవనం మొదలు పెట్టడంతో అతని చిత్రాలకు అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేసింది. పవన్ తో విడాకులు తీసుకున్న తర్వాత రేణు దేశాయ్ “ఇష్క్ వాలా లవ్” అనే మరాఠి చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించింది. ఇప్పుడు మరో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతోంది. రెండో పెళ్లి తర్వాత నటిగా రీ ఎంట్రీ ఇస్తుందా? లేకుంటే ఇంటికే పరిమితమవుతుందా ? అనే ప్రశ్నలు అభిమానుల్లో మెదులుతోంది. నటిగాను ఎంట్రీ ఇవ్వదు.. ఇంటికే పరిమితకాదని తెలిసింది. తెలుగు సినిమాని డైరక్ట్ చేయనున్నట్టు ఆమె స్వయంగా చెప్పారు. “తెలుగు సినిమాకి కథ, స్క్రీన్ ప్లే పూర్తి అయింది.

డైలాగ్స్ రాస్తున్నాను. ఇది రైతుల జీవితాలు .. సమస్యలు .. వాళ్ల ఆత్మహత్యలపై ఈ కథ కొనసాగుతుంది. ఈ సినిమాలో రైతుల సమస్యలను చూపించడమే కాదు, వాటికి పరిష్కారాలు కూడా చూపిస్తాను. అందుకే రైతుల జీవితాలను చాలా దగ్గరగా పరిశీలించాలని అనుకుంటున్నాను. ఈ విషయంపై బాగా అధ్యయనం చేసి .. వచ్చే ఏడాది జనవరి నుంచి సెట్స్ పైకి తీసుకెళ్తాను” అని రేణు వివరించారు. రైతుల సమస్యలపై తెరకెక్కే సినిమాలు ఎక్కువశాతం విజయం సాధించాయి. అందుకే రేణు దేశాయ్ డైరక్టర్ గా చేసే తొలి తెలుగు చిత్రం కూడా హిట్ అయ్యే ఆస్కారం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus