Renudesai: రేణు దేశాయ్ భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నారా?

నటి రేణు దేశాయ్ చాలా రోజుల తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు .జానీ సినిమా తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరమైనటువంటి ఈమె ప్రస్తుతం రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా దసరా పండుగను పురస్కరించుకొని అక్టోబర్ 20వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నటి రేణు దేశాయ్ మాట్లాడుతూ తాను ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల గురించి వెల్లడించారు. ఈ సినిమా తర్వాత తాను కొంత సమయం గ్యాప్ తీసుకుంటున్నానని పేర్కొన్నారు అయితే ఇలా ఇండస్ట్రీకి గ్యాప్ తీసుకోవడానికి కారణం లేకపోలేదు. ఈమె గత కొద్దిరోజులుగా ఒక భయంకరమైనటువంటి సమస్యతో బాధపడుతున్నట్లు వెల్లడించారు. రేణు దేశాయ్ (Renudesai) మయో కార్డియల్ బ్రిడ్జ్ అనే సమస్యతో బాధపడుతున్నారట.

ఇది గుండెకు సంబంధించిన జబ్బు కావడంతో డాక్టర్లు కూడా చాలా జాగ్రత్తగా ఉండమని సూచించారట .ఈ సమస్యకు తాను మందులు వాడటం వల్ల అధికంగా శరీర బరువు పెరిగిపోతున్నానని ఈమె తెలియజేశారు. ఇలా మెడిసిన్స్ వాడటం వల్ల కొన్ని సార్లు కోమాలోకి కూడా వెళ్లే అవకాశం ఉందని డాక్టర్లు తెలియజేసినట్లు రేణు వెల్లడించారు. మయోకార్డియల్ బ్రిడ్జింగ్ అంటే..గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులు అవయవం ఉపరితంలో ఉంటాయి.

కానీ కొందరిలో ఈ ధమనులలో ఒకటి గుండె కండరాల్లోకి వెళ్తూ.. మళ్లీ బయటకు వస్తుందట. కొందరికి పుట్టుకతోనే ఈ సమస్య వస్తుంది అలాంటి వారీకి ఇది ప్రమాదం కాదని,గుండె కండరాలకు వెళ్లే రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుందట. వ్యాయామం చేసే సమయంలో ఛాతి నొప్పి లేదా అసౌకర్యానికి గురి చేస్తుందట. కొందరిలో గుండెపోటు అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది ఇలా ఈమె గురించి ఈ విషయం తెలియడంతో అభిమానులు కూడా ఈమె ఇలాంటి భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నారా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus