మెగా మేనల్లుడు సాయి తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘రిపబ్లిక్’. దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘జె.బి.ఎంటర్టైన్మెంట్స్’ ‘జీ స్టూడియోస్’ బ్యానర్ల పై జె.భగవాన్, జె.పుల్లారావు లు కలిసి నిర్మించారు. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటించగా…రమ్యకృష్ణ, జగపతి బాబు వంటి వారు కీలక పాత్రలు పోషించారు.అక్టోబర్ 1న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది కానీ.. ఓపెనింగ్స్ మాత్రం ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు.
వీక్ డేస్ లో అయితే మరీ ఘోరం. ఇక ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ను ఓసారి గమనిస్తే :
| నైజాం | 1.82 cr | 
| సీడెడ్ | 1.08 cr | 
| ఉత్తరాంధ్ర | 0.70 cr | 
| ఈస్ట్ | 0.40 cr | 
| వెస్ట్ | 0.38 cr | 
| గుంటూరు | 0.43 cr | 
| కృష్ణా | 0.41 cr | 
| నెల్లూరు | 0.29 cr | 
| ఏపీ + తెలంగాణ (టోటల్) | 5.51 cr | 
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.30 Cr | 
| ఓవర్సీస్ | 0.45 Cr | 
| వరల్డ్ వైడ్ (టోటల్) | 6.26 cr | 
‘రిపబ్లిక్’ చిత్రానికి రూ.13.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.14 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. కానీ మొదటివారం పూర్తయ్యేసరికి ఈ చిత్రం కేవలం రూ.6.26 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.7.24 కోట్ల షేర్ వరకు రాబట్టాల్సి ఉంది.ఇక అది కష్టమనే చెప్పాలి.
Most Recommended Video
సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు