‘లవ్ టుడే’ (Love Today) హీరో ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) లేటెస్ట్ మూవీ ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ (Return of the Dragon) ఇటీవల అంటే ఫిబ్రవరి 21న రిలీజ్ అయ్యింది. ‘ఓ మై కడవులే'(తెలుగులో ‘ఓరి దేవుడా) ఫేమ్ అశ్వథ్ (Ashwath Marimuthu) దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. మొదటి షోతోనే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. మొదటి రోజు బుకింగ్స్ కొంచెం స్లోగా ఉన్నా.. రెండో రోజు నుండి బాగా పికప్ అయ్యింది. యూత్ కి కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ ఇందులో ఎక్కువగా ఉండటం వల్ల.. యూత్ అటెన్షన్ ను డ్రా చేసింది.
అందువల్ల వీకెండ్ ఈ సినిమాకి మంచి వసూళ్లు వచ్చాయి.4వ రోజు సోమవారం అయినా.. ఈ సినిమా బాగానే క్యాష్ చేసుకుంది. ఒకసారి 4 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 1.26 cr |
సీడెడ్ | 0.34 cr |
ఆంధ్ర(టోటల్) | 1.02 cr |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 2.62 cr |
‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ చిత్రానికి తెలుగులో రూ.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.3.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 4 రోజుల్లో ఈ చిత్రం రూ.2.62 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.4.4 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.0.88 కోట్ల షేర్ ను రాబట్టాలి. సోమవారం అనుకున్నదానికంటే ఈ సినిమా బెటర్ గానే పెర్ఫార్మ్ చేసింది అని చెప్పాలి.