క్రిటిక్స్ బాలేదన్న సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులు

అద్భుతమైన రివ్యూలు వచ్చినంత మాత్రాన ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించదు. అలాగే.. చెత్త రివ్యూలు వచ్చినంత మాత్రాన ఏ చిత్రం బాక్సాఫీస్ దగ్గర తుస్సుమనదు. తాజాగా ఈ విషయం “కాంచన 3” సినిమాతో మరోసారి రుజువైంది. “జెర్సీ” చిత్రానికి 3 నుంచి 3.5 రేటింగ్స్ ఇచ్చిన విశ్లేషకులందరూ “కాంచన 3″కి ఏకిపడేసి 1 లేదా 1.5 రేటింగ్స్ తో సరిపెట్టారు. సో, రూల్ ప్రకారం “కాంచన 3″కి కనీస స్థాయి కలెక్షన్స్ కూడా రాకూడదు. కానీ.. సింగిల్ స్క్రీన్స్ లో “జెర్సీ”తో సమానమైన కలెక్షన్స్ సాధించింది “కాంచన 3”. ఇంకొన్ని సెంటర్స్ లో అయితే “జెర్సీ”ని మించిన కలెక్షన్స్ వసూలు చేసింది కూడా.

అయితే.. ఇక్కడ “కాంచన 3” కమర్షియల్ గా సూపర్ హిట్ అవ్వడం అనేది ఇప్పుడు మరోసారి ఆడియన్స్ పాయింటాఫ్ వ్యూ మీద రివ్యూ రైటర్ల పట్టును ప్రశ్నించింది. అసలు కనీస స్థాయి రివ్యూలు కూడా రాని సినిమాకి ఈస్థాయి కలెక్షన్స్ రావడం అంటే ఆడియన్స్ పల్స్ అర్ధం చేసుకోవడంలో రివ్యూ రైటర్లు మరోమారు ఫెయిల్ అయ్యారా లేక కొన్ని సినిమాల విషయంలో జనాలు రివ్యూలు పట్టించుకోవడం మానేశారా అనేది చర్చనీయాంశం అయ్యింది. ఈ ప్రశ్నకి సమాధానం ఇప్పట్లో దొరకదు అనుకోండి. కానీ.. “కాంచన 3” సాధిస్తున్న కలెక్షన్స్ మాత్రం నిజంగానే ఆశ్చర్యకరం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus