శివ లాంటి ఎపిక్ సినిమా తీసిన వర్మ ఇప్పుడు స్పూఫ్ సినిమాలు చేసుకుంటూ బ్రతికేస్తున్నాడు. తలచుకొంటే “అసురన్” లాంటి సినిమాలు తెలుగులో తీయగలిగే ఏకైక దర్శకుడు వర్మ. కానీ.. ఆయనకి హిట్ కంటే పబ్లిసిటీ కావాలి. హిట్ వస్తే వర్మను ఎవరైనా పట్టించుకొంటారో లేదో తెలియదు కానీ.. కాంట్రవర్సీ చేసి హడావుడి చేస్తే మాత్రం కొందరు పనిలేనివాళ్లు వర్మను టార్గెట్ చేస్తూ ట్వీట్లు, ప్రెస్ మీట్లు పెట్టి హడావుడి చేయడం.. ఆ హడావుడిని వర్మ ఎంజాయ్ చేస్తూ పబ్లిసిటీకి వాడుకోవడం అనేది గత కొన్నాళ్లుగా జరుగుతున్న విషయం.
అయితే.. ఈ దర్శకత్వం, నిర్మాణం, గొడవలు చేసి చేసి బోర్ కొట్టేసినట్లుంది ఆర్జీవీకి. అందుకే ఇప్పుడు తన దృష్టిని యాక్టింగ్ వైపు మరల్చాడు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రమైన “కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” చిత్రంలో ఆర్జీవీ తన నిజజీవిత పాత్రలో కనిపించనున్నారు. ఇకపోతే.. ఇప్పటివరకూ ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి బిజినెస్ జరగకపోవడం గమనార్హం.
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!