రామ్ గోపాల్ వర్మ…ఈ పేరు వింటేనే ఒక్కసారిగా కాంట్రొవర్సీస్ గుర్తుకు వస్తాయి. ఆయన ఎప్పుడు ఎవరిని ఏమంటాడో అన్న భయంతో ఉంటారు అందరూ. అయితే ఎప్పుడూ ఎవరో ఒకరిపై మాట్లాడుతూ హల్చల్ చేసే వర్మ తాజాగా మరోసారి తన ట్వీట్ తో బెజవాడ వార్ ని టచ్ చేశాడు…అసలు మ్యాటర్ లోకి వెళితే…బెజవాడ వైసీపీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్న నేపథ్యంలో మొన్న జరిగిన పరిణామాల గురించి తెలిసిందే. వైసీపీ బహిష్కృత నేత గౌతమ్ రెడ్డి రంగా, రాధా హత్యలకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపాయి. విజయవాడలో మొన్న రంగా కుమారుడు రాధా, రంగా భార్య రత్నకుమారిలను ఉద్రిక్తతలు చోటుచేసుకుంటాయన్న కారణంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్లో రంగా భార్య రత్నకుమారి, కొడుకు రాధా కింద కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సమయంలో రాధా చొక్కా గుండీలు ఊడిపోయి ఉన్నాయి.
రంగా కుటుంబంతో పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ కార్యకర్తలు స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేశారు. అయితే ఈ సంధర్భాన్ని తన స్టైల్ లో ట్వీట్ చేస్తూ…నిన్న విజయవాడలో వంగవీటి రంగా కుటుంబం పోలీస్ స్టేషన్లో కింద కూర్చుని ఉన్న ఫొటోలను తన ఫేస్బుక్లో పోస్ట్ చేసి..తనకు వంగవీటి భార్య, కొడుకు అంటే ఎనలేని ప్రేమ అంటూనే, స్టేషన్లో ఇలా కూర్చున్నందుకు వంగవీటి రంగా తన భార్య, కొడుకు పట్ల ఎంతో గర్వంగా ఫీలవుతాడని, స్వర్గంలో బ్రేక్ డ్యాన్స్ కూడా వేస్తాడని వర్మ ట్వీట్ చేశాడు. అక్కడితో ఆగకుండా తల్లి ఎందుకు నల్లగా ఉందో, కొడుకు ఎందుకు తెల్లగా ఉన్నాడో లోరియల్ కాస్మొటిక్ కంపెనీ చెప్పాలని సైతం వర్మ పోస్ట్ చెయ్యడంతో ఆ పోస్ట్‌పై పెనుదుమారమే రేగుతోంది. మరి ఈ పోస్ట్ ఎంతవరకూ దారి తీస్తుందో చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.