వివాదాస్పద అంశాల ద్వారా నిత్యం ఏదో ఒక విధంగా వార్తల్లో నిలవడానికి ప్రయత్నించే దర్శకుడు ఎవరైనా ఉన్నారా అంటే ఆ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రమే అని చెప్పాలి. అనవసర విషయాలపై, తనకు ఏ మాత్రం సంబంధం లేని విషయాలపై కూడా స్పందిస్తూ రామ్ గోపాల్ వర్మ వార్తల్లో నిలిచే ప్రయత్నం చేస్తుంటారు. ఏపీలో గత కొన్నిరోజుల నుంచి ప్రభుత్వం పది, ఇంటర్ పరీక్షల విషయంలో తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాల నుంచి, కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ప్రస్తుతం రోజుకు 4 లక్షల కేసులు నమోదవుతుండగా మే నెల చివరి నాటికి కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. అయితే పది, ఇంటర్ పరీక్షల గురించి తాజాగా వర్మ స్పందిస్తూ ఆసక్తికర ట్వీట్లు చేశారు. జగన్ సర్కార్ పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తే 90 శాతం మంది విద్యార్థులు సంతోషంగా ఫీలవుతారని వర్మ అన్నారు. 90 శాతం మంది విద్యార్థులు తనలాగే బ్యాడ్ స్టూడెంట్స్ అని వర్మ పేర్కొన్నారు.
అలాంటి స్టూడెంట్స్ ఎప్పుడూ పరీక్షలు వాయిదా పడాలని కోరుకుంటారని వర్మ అన్నారు. కాబట్టి జగన్ చిల్ కావాలని కోరుకుంటున్నానని వర్మ పేర్కొన్నారు. స్టూడెంట్స్ కు స్టడీస్ కంటే లైఫ్ ముఖ్యమని కరోనా బారిన పడకుండా ఉంటారా..? ఏడాది స్టడీస్ కోల్పోతారా..? అనే ఛాయిస్ ఇస్తే ఎక్కువ మంది విద్యార్థులు మొదటి ఛాయిస్ నే ఎంచుకుంటారని వర్మ వెల్లడించారు. వర్మ ట్వీట్స్ పై వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
Given a choice between not contracting covid and losing out on a year of studies , all students will prefer the first because the majority of them don’t care a F about studies but they care a lot of F’s about their life ..AMEN!
90% of SSC students will be super happy if exams are cancelled becos 90% students are bad like me who always love postponements and the so called 10% good ones will always work under the 90% successful bad ones ..So my two bit advise to @ysjagan is to CHILL🙏