టాలీవుడ్ మీదుగా బాలీవుడ్ వెళ్లిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి సెంటిమెంట్స్ ఉండవు. ఇది ఆయన ఎన్నోసార్లు మీడియాలో చెప్పిన మాట. అమ్మ మీద ప్రామిస్, నాన్న మీద ప్రామిస్ అని చెప్పడమన్నా చిరాకు. ఒట్టు వేయడాన్నే నాన్సన్స్ అంటుంటారు. కానీ వర్మ అదే ఫాలో అయ్యారు. ఎవరి మీదో కాదు… తన మీద తానే ఒట్టేసుకొని నవ్వులు పూయించారు. ‘శివ టు వంగవీటి.. ద జర్నీ ఆఫ్ రామ్ గోపాల్ వర్మ’ అనే పేరుతో జూబ్లీ హిల్స్ లోని జీఆరేసీ కన్వెన్స్ సెంటర్ లో నిన్న(బుధవారం) రాత్రి వేడుక నిర్వహించారు. ఈ ఫంక్షన్‌కు అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్, ఎస్.ఎస్.రాజమౌళి, వర్మ వద్ద అసిస్టెంట్ గా పనిచేసిన దర్శకులు, వంగవీటి చిత్ర బృందం హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వర్మ సీరియస్ విషయాలను సైతం చాలా తమాషాగా చెప్పారు.
‘‘నా చివరి తెలుగు సినిమా ‘వంగవీటి’ అని చెప్పాను. అన్నమాట మీద నేను నిలబడనని అందరికీ తెలుసు.” అంటూ ఇదివరకటి తన మాటను బ్రేక్ చేశారు. “ఎందుకు మంచి చిత్రాలు తీయరని రాజమౌళి నన్ను ఫోన్లో ప్రశ్నించారు. అందుకే ఇక ముందు నేను గర్వంగా చెప్పుకొనే సినిమాలే చేస్తాను. నాకు నాకన్నా ఇంకెవరూ ఇష్టం లేదు. అందుకే నామీద నేనే ఒట్టేసుకొని రాజమౌళికి నేనిస్తున్నమాట ఇది.’’ అని చెప్పారు. తర్వాత కింగ్ నాగార్జున మాట్లాడుతూ “వర్మ ఇలా ఓట్లు వేయడం ఏమిటని” అందరి ముందూ నవ్వుతూ ప్రశ్నించారు. వర్మ వర్మలాగే ఉండాలని సూచించారు. రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వం వహించిన ‘వంగవీటి’ సినిమా ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.