‘రాయ్’ మెగా లాంచ్

కోర్టులో ఒక్క మర్డర్ కేసు తేలడానికే 20 ఏళ్లు పడుతుంది. కానీ 20 మర్డర్ కేసుల్లోంచి 21 నెలల్లో బయటపడ్డాడు. 30 రూపాయలతో మొదలు పెట్టి, 30 ఏళ్ల క్రిమినల్ కెరీర్ లో 30 వేల కోట్లు సంపాదించాడు. నేరస్థుడి భవిష్యత్ చీకటి అని చరిత్ర చెప్పింది, కాదు, వేయి సూర్యుల వెలుగు అని నిరూపించాడు. అలాంటి నేరాలు తర్వాత ఇవాళ అతడిని కోట్ల మంది అభిమానిస్తున్నారు. అతడే ‘రాయ్’.

దాసరి కిరణ్ కుమార్ సమర్పణలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో సి.ఆర్.మనోహర్(ఎం.ఎల్.సి) నిర్మాతగా, ప్రముఖ బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్ టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రాయ్’. గ్యాంగ్ స్టర్ ముత్తప్ప రాయ్ జీవితం ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను మే 1న బెంగళూరు బిదాడిలో అభిమానులు మధ్య విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముత్తప్పరాయ్, రామ్ గోపాల్ వర్మ, వివేక్ ఒబెరాయ్, సి.ఆర్.మనోహర్, దాసరి కిరణ్ కుమార్ తదితరులు హాజరయ్యారు.

కార్యక్రమానికి హాజరైన ముత్తప్పరాయ్ యూనిట్ సభ్యులందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు. 55 కోట్ల భారీ బడ్జెట్ తో లండన్, దుబాయ్, ముంబై, బెంగళూరు తదితర ప్రాంతాల్లో సినిమాను చిత్రీకరించనున్నామని దర్శక నిర్మాతలు తెలియజేశారు. ఈ సినిమా హిందీ వెర్షన్ హక్కులను వేవ్ ఫిలింస్ అధినేత రాజు చద్దా, ఈరోజ్ ఇంటర్రేషనల్ సునీల్ లుల్లా కైవసం చేసుకున్నారు. అలాగే తమిళ హక్కులను సౌతిండియా ఫిలించాంబర్ అధ్యక్షుడు గంగరాజు ఫ్యాన్సీ చేటు చెల్లించి సొంతం చేసుకున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus